Tuesday, March 19, 2024

కుజదోషం అంటే ఏమిటి..? పెళ్లిళ్లపై దాని ప్రభావం

- Advertisement -
- Advertisement -

కుజ దోషం – వివరణ

కుజ దోషం అనగానే భయపడుతుంటారు. ముఖ్యంగా వివాహాల విషయంలో దీనిని ఎక్కువగా పరిశీలిస్తారు. దోషం ఉన్నదా? లేదా? అన్నది జాతకచక్రం నిశితంగా పరిశీలించి నిర్ధారించుకోవాలి.

కుజదోషం అంటే ?…
జాతకచక్రంలో కుజుడు జన్మ లగ్నాత్తు (లగ్నం నుంచి), చంద్రుడు, శుక్రుని లగాయతు 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉన్నా, ఆ స్థానాలకు కుజదృష్టి కలిగినా దోషమని శాస్త్రం. అయితే దీనికీ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అలాగే వధూవరుల జాతకాల్లో కుజదోషం సమానస్థాయిలో ఉంటే వివాహం చేయవచ్చునని చెబుతారు. ఒకరి జాతకంలో  చేయడం నష్టదాయకమని చెబుతారు.

అయితే కొన్ని రాశులు, లగ్నాల వారికి కుజదోషం వర్తించదు. మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన లగ్న జాతకులకు కుజదోషం వర్తించదు. కుజుడు సప్తమ స్థానంలో ఉంటే దోషమని భయపడుతుంటారు. కానీ కొన్ని రాశులకు సప్తమ కుజుడు దోషకారి కాడని జ్యోతిష్య పండితులు చెబుతారు. ఉదా.. కర్కాటకం, ధనుస్సు, మీన రాశులు సప్తమ స్థానాలై అక్కడ కుజుడు ఉంటే శుభకరుడని, దోషకారి కాదని కూడా చెబుతారు. అలాగే తుల, వృషభ రాశులు సప్తమమై వాటిలో కుజుడు ఉంటే భార్యాభర్తలు అనురాగంతో ఉంటారని, కన్య, కుంభరాశులు సప్తమాలై అక్కడ కుజుడు ఉంటే వివాహానంతరం భోగభాగ్యాలు అనుభవిస్తారని శాస్త్రం చెబుతోంది.

అలాగే కుజునికి చంద్రుడు, గురు, శుక్ర, బుధుల దృష్టి లేదా కలిసినా, 10వ స్థానంలో శుభగ్రహం ఉన్నా కుజదోషం ఉండదు. ఇక మిథున, కన్యలకు ద్వితీయ కుజుడు, మేష, వృశ్చికాలకు చతుర్థ కుజుడు, మకర, కర్కాటకాలకు సప్తమ కుజుడు, ధనుర్మీనాలకు అష్టమ కుజుడు, తుల, వృషభాలకు వ్యయ కుజుడు, కుంభం, సింహ లగ్నాలకు కుజుడు ఎక్కడ ఉన్నా దోషకారి కాదని చెబుతారు. కేవలం జాతకచక్రంలో కుజ దోషం ఒక్కటే కాకుండా, శుక్రబలం, రాహు, కేతువుల స్థితి, సర్పదోషం వంటి అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. కుజుడు పాప స్థానాల్లో ఉన్నాడని భయపడకుండా, మినహాయింపులు పరిశీలించి, దోష పరిహారాలు చేయడం ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News