Wednesday, August 6, 2025

యువతితో మాట్లాడుతూ చెట్టు ఎక్కిన యువకుడు… కరెంట్ షాక్ తో మృతి

- Advertisement -
- Advertisement -

కూకట్  పల్లి: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు అమ్మాయితో మాట్లాడుతూ చెట్టు ఎక్కడంతో కరెంట్ షాక్ తగిలి అతడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వేణు(22) హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. హెచ్ ఎంటి సాతావాహన నగర్ పార్క్ వద్ద వేణు, ఓ అమ్మాయితో మాట్లాడుతూ చెట్టు ఎక్కుటకు ప్రయత్నించాడు. చెట్టుకు ఉన్న విద్యుత్ తీగ తగలడంతో కరెంట్ షాక్ తో కిందిపడిపోయాడు. వెంటనే స్థానికులు సిపిఆర్ చేసి అంంబులెన్స్ లో కూకట్ పల్లిలోని రాందేవ్ రావ్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News