హైదరాబాద్: ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తన స్నేహితుడితో కలిసి ఆమె భర్తపై హత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మెదక్ జిల్లాకు చెందిన దేశబోయిన భూపాల్‌తో కామారెడ్డికి చెందిన చంద్రకళకు(23) ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. దంపతులు కూకట్‌పల్లిలోని సుమిత్రానగర్‌లో నివాసం ఉంటున్నారు. చంద్రకళ తన గ్రామానికి చెందిన దుర్గయ్య(26)తో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో అతడిని తన వెనక వీధిలో అద్దె ఇంట్లో ఉంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భూపాల్‌కు తెలియడంతో పలుమార్లు భార్యను మందలించాడు.
Also Read: స్థానిక సమరం… రిజర్వేషన్లు ఖరారు?
కానీ ఆమెలో మార్పు రాకపోవడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. చంద్రకళ ఇండ్లలో పని చేయడానికి వెళ్లనప్పుడు భూపాల్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. దుర్గయ్య తన స్నేహితులతో కలిసి ముఖానికి మాస్క్ వేసుకొని భూపాల్ ఇంటికి చేరుకొని అతడిని కిందపడేసి చంపుతుండగా కేకలు వేశాడు. స్థానికులు స్పందించడంతో నిందితులు పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని భూపాల్ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. తన భార్య ప్రియుడే తనపై హత్యాయత్నం చేశాడని ఫిర్యాదులో భర్త పేర్కొన్నారు. భార్య, ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.