హైదరాబాద్: గత ప్రభుత్వంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు. స్థానిక ఎమ్మల్యే, ఎమ్మెల్సీల సహకారంతో పదేళ్లుగా విచ్చలవిడిగా ఆక్రమణలు జరిగాయని మండిపడ్డారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న స్థలం వద్దకు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ చేరుకొని ప్రరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మీడియాతో మాట్లాడారు. కుత్బుల్లాపూర్ లో వందల ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా కావడానికి ప్రధాన సూత్రధారి ఎమ్మెల్యే వివేకానంద అని, పేదలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని, హైడ్రా వచ్చాక కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకెళ్తానని, ఎవరైతే నష్టపోతున్నారో ఆ పేదలకు న్యాయం జరిగేలా చూస్తామని శ్రీశైలం గౌడ్ హామీ ఇచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం సర్వేనెంబర్ 307 342, 329/1, 348 సర్వే నెంబర్లలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు ఆదివారం కూల్చివేసిన విషయం తెలిసిందే.
Also Read: ఆస్ట్రేలియా మహిళలదే సిరీస్