Saturday, April 20, 2024

బీమా పాలసీ తీసుకోవాలంటే కెవైసి

- Advertisement -
- Advertisement -

2023 జనవరి 1 నుండి కొత్త బీమా పాలసీని తీసుకోబోతున్నట్లయితే కెవైసి అంటే ‘నో యువర్ కస్టమర్’ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఎఐ) ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా పాలసీని విక్రయించే ముందు బీమా కంపెనీలు కస్టమర్ నుండి కెవైసి పత్రాలను తీసుకోవాల్సి ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మోటర్ వెహికల్ ఇన్సూరెన్స్ నుండి ట్రావెల్ ఇన్సూరెన్స్ వరకు ఏదైనా పాలసీని తీసుకోవడానికి ఈ నియమాలు పాటించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News