Friday, May 3, 2024

ఏకంగా ఒకేసారి ఉత్తరకొరియా నుంచి 8 క్షిపణుల ప్రయోగం

- Advertisement -
- Advertisement -

Launch of 8 missiles from North Korea

 

సియోల్ ( దక్షిణ కొరియా ) : అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు ముగిసిన మర్నాడే ఆదివారం ఉత్తర కొరియా తూర్పు తీరంలో ఎనిమిది స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపాన పశ్చిమ, తూర్పు సముద్రతీరం, లోతట్టు ప్రాంతాల్లో నాలుగు వేర్వేరు చోట్ల నుంచి 35 నిమిషాల వ్యవధిలో ఎనిమిది క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ వన్ ఇన్ చౌల్ వెల్లడించారు. ఈ క్షిపణులు 25 నుంచి 80 కిమీ ఎత్తులో 110 నుంచి 670 కిమీ దూరం వరకు దూసుకెళ్లాయని తెలిపారు. ఈ క్రమం లోనే తమ సైన్యాన్ని అప్రమత్తం చేశామన్నారు. అమెరికా, దక్షిణ కొరియాలు కలిసి ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తున్నాయని పేర్కొన్నారు. జపాన్ సైతం తాజా ప్రయోగాలను ధ్రువీకరించింది. అతి తక్కువ సమయంలో ఈ స్థాయిలో పరీక్షలు జరపడం అసాధారణ విషయమని, జపాన్ రక్షణ మంత్రి నోబువో కిషి ఆందోళన వెలిబుచ్చారు. 2017 తరువాత ఫుల్ రేంజి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని మొదటిసారి ఉత్తరకొరియా పరీక్షించింది. 2022 మొదటి నుంచే క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేసిన ఉత్తర కొరియా ఇప్పటివరకు 17 పరీక్షలు నిర్వహించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News