Thursday, May 2, 2024

పుడమి పులకించేలా… ప్రకృతి పరవశించేలా

- Advertisement -
- Advertisement -

నిర్మల్ ప్రతినిధి : ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో మంచి ఫలితాలు ఇస్తున్నదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించే హరితోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పా ల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు పట్టణాల్లో పు డమి పులకించేలా ప్రకృతి పరవశించేలా పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని సూచించారు. అదేవిధంగా అటవీశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనం, పెరగడానికి చేసిన కృషి వాటి ఫలితాలు గురించి ప్రజలకు వివరించాలన్నారు.

రవీంద్రభారతిలో నిర్వహించే కార్యక్రమంలో అడవుల పరిరక్షణకు విశేష కృషిచేసిన అటవీ అధికారులు, సిబ్బందిని సన్మానించి అవార్డులు అందజేస్తారని పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించే హరితోత్సవం కార్యక్రమంలో సిఎం కెసిఆర్ పాల్గొననున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్ ఫారెస్టు పార్కులో సిఎం కెసిఆర్ మొక్కలు నాటనున్నారని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News