Sunday, April 28, 2024

దోమలగూడలో అగ్నిప్రమాదం.. పిండి వంటలు చేస్తుండగా లీకైన గ్యాస్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః గ్యాస్ లీక్ కావడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంఘటన దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు, అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం…దోమలగూడ, రోజ్ కాలనీకి చెందిన బోయకర్ పద్శ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. బోనాల పండగ రావడంతో బంధువులు, కూతురు, అల్లుడు కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించింది.

పండగకు వచ్చిన బంధువులు ఇంట్లో ఉండడంతో పిండి వంటలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంట్లో వంటలు చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఇల్లు మొత్తం దగ్ధమైంది, అందులో ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాపడిన వారిలో ఎస్. ఆనంద్(41), ఎస్.నాగమణి(38౦, పద్శ(48), ధనలక్ష్మి(33), ముగ్గురు చిన్నారులు అభినవ్(8), శరణ్య(6), విహార్(3) ఉన్నారు.

ఆరుగురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. స్థానికులు పద్మ కుటుంబ సభ్యులను కాపాడేందుకు యత్నించిగా అప్పటికే వారు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిప్రమాదానికి ఇల్లు పూర్తిగా కాలిపోయిందని ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News