Saturday, October 12, 2024

‘మ్యాడ్‌ స్క్వేర్‌’ ఫస్ట్లుక్‌ విడుదల

- Advertisement -
- Advertisement -

నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ కథానాయకులుగా తెరకెక్కిన మ్యాడ్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం గతేడాది అక్టోబరులో విడుదలైన భారీ కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు దీని సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు మ్యాడ్ స్క్యేర్ టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. అలాగే, ఫస్ట్ సింగిల్ ను సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

కాగా, కల్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీగౌరి ప్రియా రెడ్డి, అనంతికా సునీల్‌ కుమార్‌, గోపికా ఉద్యన్‌ హీరోయిన్లుగా నటించారు. సీక్వెల్ లోనూ వీళ్లే నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను నిర్మాత నాగవంశీ సమర్పిస్తున్నారు. సితార ఎంటర్‌ టైన్‌ మెంట్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారికా సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News