Monday, May 13, 2024

రేప్ కేసులో బిజెపి నేత అరెస్టు

- Advertisement -
- Advertisement -

Rape

 

భోపాల్: ఒక దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణపై బిజెపి నాయకుడు ఒకరిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్ జిల్లా బిజెపి మీడియా ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న దేవేంద్ర తమ్రాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సింగ్రౌలీ జిల్లాకు చెందిన ఒక దళిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ జిల్లాకు చెందిన పోలీసు బృందం తమ్రాకర్‌ను ఆదివారం అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచింది. గత ఏడాది నవంబర్ 30న ఈ దారుణం జరుగగా డిసెంబర్ 31న పోలీసులు కేసు నమోదు చేశారు. తమ్రాకర్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో తన భర్త కూలీగా పనిచేస్తాడని, తనకు తమ్రాకర్ తెలుసునని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

సంఘటన జరిగిన రోజున తమ్రాకర్ తన ఇంటికి కారులో వచ్చాడని ఆమె తెలిపింది. తాను వారణాసి వెళుతున్నానని, తనతోపాటు వస్తే సింగ్రౌలీ జిల్లాలో ఉన్న తన మిత్రుడి గనిలో మీ ఇద్దరికీ ఉద్యోగం ఇప్పిస్తానని తమ్రాకర్ చెప్పాడని ఆమె వివరించింది. మరుసటి రోజు తాము కారులో సింగ్రౌలీ చేరుకున్నామని, ఒక దాబా వద్ద తన భర్తకు అతను మద్యం తాగించాడని ఆమె చెప్పింది. తన భర్త తాగి ఉన్నందున ఒంటరిగానే తన మిత్రుడి గని వద్దకు రావాలని అతను కోరాడని ఆమె చెప్పింది. ఒక నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి తాను వద్దని ప్రతిఘటిస్తున్నప్పటికీ బలవంతంగా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా తమ్రాకర్ బెదిరించినట్లు ఆమె చెప్పింది. కాగా, తమ్రాకర్ అరెస్టును రాజకీయ కక్షసాధింపుగా బిజెపి అభివర్ణిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వమే తప్పుడు కేసులో ఇరికించిందని బిజెపి ఆరోపించింది.

Madhya Pradesh BJP leader arrested on rape charges

 

BJP leader arrested on rape charges, MP BJP leader Devendra Tamrakar was arrested after a dalit woman accused him of raping
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News