Thursday, April 25, 2024

భారత్ జోడో యాత్రలో జోడు గాంధీలు

- Advertisement -
- Advertisement -

 

నెహ్రూ మునిమనవడితో కదిలిన గాంధీ మునిమనవడు

షెగాన్ : మహారాష్ట్రలో సాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో శుక్రవారం గాంధీజి మునిమనవడు తుషార్ గాంధీ తోడుగా పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి నడిచారు. బుల్ధానా జిల్లాలోని షోగాన్ వద్ద తుషార్ ఈ కార్యక్రమంలో చేరారు. ఈ భారత్ జోడో యాత్రలో తుషార్ పాల్గొనడం చారిత్రకం అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ నెల 7వ తేదీనుంచి మహారాష్ట్రలో యాత్ర సాగుతోంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో తుది మజిలీలో ఉంది.

అకోలా జిల్లాలోని బాలాపూర్ నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటలకు యాత్ర బయలుదేరింది. ఆ తరువాత కొద్ది గంటలకు రచయిత, సామాజిక ఉద్యమనేత అయిన తుషార్ గాంధీ ఈ యాత్రలో వచ్చి చేరారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతం తన జన్మస్థలం అని ఆ తరువాత తుషార్ ట్వీట్ వెలువరించారు. దీనికి సంబంధించి ఆయన ఒకరోజు ముందు వివరణ ఇచ్చారు. తన తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు 1960 జనవరి 17వ తేదీన తల్లి ప్రయాణిస్తున్న రైలు షెగాన్ రైల్వే స్టేషన్‌లో ఆగిందని, ఈ సమయంలోనే ఆమె తనకు జన్మ నిచ్చిందని తుషార్ తెలిపారు.

ఈ విధంగా తనకు ఈ ప్రాంతం జన్మానుబంధం ఉందని ఆయన వివరిచారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ ముని మనవలు ఇప్పుడు ఈ పాదయాత్రలో పాల్గొనడం ద్వారా ఆ దివంగత మహనీయ నేతల విశిష్ట వారసత్వాన్ని కొనసాగించే వారధులుగా మారారని కాంగ్రెస్ పేర్కొంది. ఈ ఇద్దరూ కలిసి పాల్గొనడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఇరకాటంలోకి నెడుతోన్న పాలకులకు ఆ ఆటలు చెల్లనేరవనే విషయాన్ని తెలియచేస్తున్నారని పార్టీ ఓ ప్రకటన వెలువరించింది. ఇప్పటి ఇక్కడి యాత్రలో తుషార్ గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్ , హూడా, మిలింద్ డియోరా, మాణిక్‌రావు థాక్రే, ముంబై కాంగ్రెస్ అధ్యక్షులు భాయ్ జగ్‌తాప్ , పిసిసి అధ్యక్షులు నానా పటోలే కూడా రాహుల్‌తో కలిసి నడిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News