హైదరాబాద్: స్వాతంత్ర్య పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమం కీలకమైనదని టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. డూ ఆర్ డై నినాదంతో మన జాతిపిత మహాత్మ గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించారని అన్నారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ గాంధీభవన్ లో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చరిత్రను తుడిచివేయాలని బిజెపి చూస్తోందని, రాజ్యాంగం మార్చాలని బిజెపి చూస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగ సంస్థలతో ప్రతిపక్షాలపై కుట్ర పూరిత దాడి చేస్తున్నారని, ఎన్నికల కమిషన్ బిజెపికి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ (Frontal organization) గా మారిందని విమర్శలు గుప్పించారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహులని ముద్ర వేస్తున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. క్విట్ బిజెపి అంటేనే దేశానికి భవిష్యత్తు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణ కోసం పని చేస్తుందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ చరిత్రను తుడిచివేయాలని బిజెపి చూస్తోంది: మహేశ్ కుమార్ గౌడ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -