Thursday, May 2, 2024

తెలంగాణ రన్ విజయవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం నిర్వహించనున్న తెలంగాణా రన్ విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి. హైదరాబాద్ లో సోమవారం ఉదయం 6 గంటలకు నెక్లెస్ రోడ్లో ని డా. బి.ఆర్ అంబేద్కర్ స్టాచు సమీపంలోని మైదానం నుండి ప్రారంభమయ్యే 2 కె, 4 కే రన్ లలో దాదాపు ఐదు వేల మంది రన్నర్లు పాల్గొన నున్నారు.

ఈ రన్ లో రాష్ట్ర మంత్రులు, ఎంఎల్‌సిలు,, ఎంఎల్‌ఎలు, కార్పొరేటర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొంటారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ రన్‌కు, విద్యాశాఖ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ, ఐటి , మున్సిపల్ తదితర శాఖల ఉద్యోగులు పాల్గొనే విధంగా చర్యలు చేపట్టారు.

రన్ ప్రారంభానికి ముందు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, బెలూన్స్ ఎగుర వేయ డం లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా, ఈ తెలంగాణా రన్ లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ప్రభుత్వం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ఈ రన్ లో పాల్గొనే వారు సోమవారం ఉదయం 6 గంటల లోగా నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం రోటరీ మైదానానికి చేరుకోవాలని ఆయా ప్రకటనలో కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News