Monday, April 29, 2024

చెన్నమనేనికి గౌరవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, దివంగత చెన్నమనేని రాజేశ్వర్ రావు శత జయంతి (ఆగస్టు 31) సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 9 (మల్కపేట రిజర్వాయర్‌తో పాటు దాని పరిధిలోని కాల్వలకు మిడ్ మానేర్ నుంచి అప్పర్ మానేర్ దాకా)కు…“చెన్నమనేని రాజేశ్వర్ రావు” పేరు పెడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఆయన సామాజిక సేవను గుర్తిస్తూ… సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల పరిథిలో సాగునీరు, తాగునీరును అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 9కి సిఎం కెసిఆర్ చెన్నమనేని రాజేశ్వర్‌రావు పేరు పెట్టారు. ఈ సందర్భంగా చెన్నమనేని రాజేశ్వర్ రావు సామాజిక సేవలను సిఎం కెసిఆర్ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… “స్వాతంత్య్ర సమరయోధుడుగా, తెలంగాణ మొదటితరం రాజకీయ వేత్తగా, నిరంతరం ప్రజలకోసం పోరాడిన గొప్పనేత చెన్నమనేని రాజేశ్వర్ రావు అని కొనియాడారు.

తెలంగాణ రైతాంగం కోసం ఆనాటి కాలంలోనే వరద కాల్వ కోసం ఎత్తిపోతల పథకాల కోసం పోరాడిన చరిత్ర ఆయనదని, సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల నుంచి అత్యంత ప్రజాదరణ కలిగిన నేత చెన్నమనేని రాజేశ్వర్‌రావు అని పేర్కొన్నారు.పలు దఫాలు ఎంఎల్‌ఎగా గెలిచి ఆ ప్రాంత ప్రజల సాగునీరు, తాగునీరు కష్టాలను తీర్చడానికి ఎత్తి పోతల పథకం కోసం చెన్నమనేని రాజేశ్వర్ రావు ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు. నాటి చెన్నమనేని రాజేశ్వర్‌రావు ఆకాంక్షలను ప్రతిఫలించే విధంగా స్వరాష్ట్రంలో సాగునీరు ప్రాజెక్టులను ఎత్తిపోతల పథకాలను నిర్మించుకున్నామని తెలిపారు. తెలంగాణ రైతాంగం నేడు దేశం గర్వించే స్థాయిలో పంటలు పండిస్తున్నారని అన్నారు. ప్రజాప్రతినిధిగా ఆయన పనిచేసిన ప్రాంత ప్రజలకు కాళేశ్వరం పథకంలో భాగంగా నిర్మించిన ప్యాకేజీ 9 ద్వారా సాగునీరు అందుతున్నదని తెలిపారు. మిడ్ మానేర్ (ఎస్ ఆర్ ఆర్) నుంచి ఎత్తిపోతల ద్వారా అప్పర్ మానేర్ దాకా నీటి సరఫరా జరుగుతున్నదని చెప్పారు.

ఈ నేపథ్యంలో… నాటి చెన్నమనేని రాజేశ్వర్‌రావు కృషిని గుర్తిస్తూ, ఆయనను గౌరవిస్తూ, మల్కపేట రిజర్వాయర్‌కు దాని పరధిలోని ఎత్తిపోతల పథకానికి మొత్తంగా ప్యాకేజీ 9కు “చెన్నమనేని రాజేశ్వర్ రావు” పేరు పెట్టినట్లు సిఎం తెలిపారు. సిఎం కెసిఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News