Saturday, September 20, 2025

బలహీన ప్రధాని నిర్వాకంతోనే వీసా పిడుగుపాటు: ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ ః హెచ్ 1 బి వీసాలపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ పిడుగుపాటు నిర్ణయం బలహీన ప్రధాని చేతకానితనమే అని కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. ప్రధాని మోడీ తరచూ కీలక విషయాలపై ఏదో వ్యూహాత్మకం అన్నట్లు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించడం, వాగ్ధాడంబర ప్రేలాపనలకు దిగడం పరిస్థితిని విషమింపచేసిందని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. మోడీ వ్యవహార శైలి దేశానికి భారం అవుతోందని, యువతపై ప్రభావం పడుతోందని , వీక్ పిఎం దేశ జాతీయ ప్రయోజనాలను రక్షించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. అసలు విదేశాంగ విధానం ఏమిటనేది మోడీకి తెలుసా? దేశ ప్రయోజనాలను రక్షించాలి. పెద్ద పెద్ద ఈవెంట్లు పెట్టడం కాదు, భారత్ ప్రధమం అనేలా వ్యవహరించడం అని ఖర్గే స్పష్టం చేశారు. నేతలతో ఆలింగనాలు, కరచాలనాలు , శుష్క నినాదాలు వేడుకలు, మోడీ మోడీ అన్పించుకోవడాలు విదేశాంగ విధానం అన్పించుకుంటాయా? అని నిలదీశారు. విదేశాలతో మిత్రత్వాన్ని చాకచక్యంగా, తెలివిగా, సమతూకతతో సాగించేదే విదేశాంగ విధానం అవుతుందన్నారు.

మన దీర్ఘకాలిక వైఖరిని కించపరిచే విధంగా బూటకపు ధైర్యంతో వెళ్లితే లాభం లేదని చురకలు పెట్టారు. ట్రంప్ నుంచి బర్త్‌డే ఫోన్ కాల్ తరువాత అందిన రిటర్న్ గిఫ్ట్ అంటే ఇదే. దీనితో భారతీయులు బాధపడుతున్నారు. మోడీజీ అని స్పందించారు. మీరు చెప్పిన అబ్ కీ బార్ ట్రంప్ సర్కారు నినాద ఫలితం ఇదా అని ప్రశ్నించారు. వార్షిక రుసుం లక్ష దాలర్లకు పెంచడంతో భారతీయ టెక్ నిపుణులకు ముప్పు ఏర్పడుతుంది. హెచ్ 1 వీసాదార్లలో 70 శాతం మంది వరకూ భారతీయులే ఉన్నారు, ఇప్పటికే 50 శాతం వరకూ భారీ టారీఫ్‌ఉ అనుభవించాల్సి వస్తోంది. పది రంగాలలో ఇప్పటికే రూ 2.17 లక్ష కోట్ల నష్టం వాటిల్లిందనే అంచనాలు ఉన్నాయని, బలహీన ప్రధాని దీనికి ఏం చెపుతారని ప్రశ్నించారు. హైర్ యాక్ట్‌తో భారతీయ ఔట్‌సోర్సింగ్‌పై ప్రభావం పడుతుంది. పనిలో పనిగా ట్రంప్ ఇప్పటికే భారతీయ సరుకులపై వంద శాతం సుంకాల విధింపునకు ఇయూకు చెప్పడం పరిస్థితి తీవ్రతను పెంచిందన్నారు. అదేపనిగా ట్రంప్ తానే భారత్ పాక్ యుద్ధం ఆపిన ఘనుడిని అని చెప్పడం అంతా నడుస్తున్న కథనే, వీక్ పిఎం షాక్ అని వ్యాఖ్యానించారు.

2017లోనే చెప్పా ..వీక్ పిఎం సంగతి: రాహుల్ 
భారతీయులపై హెచ్ 1 బి వీసాల ప్రభావం ఎక్కువగా పడతుందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. సామాజిక మాధ్యమంలో ఈ విషయాన్ని శనివారం ప్రస్తావించారు. తాను మరోసారి చెపుతున్నా దేశానికి బలహీన ప్రధాని ఉన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రయోజనాలను ఆయన కాపాడలేకపోతున్నారని స్పందించారు. ఈ సందర్భంగా రాహుల్ తాను 2017లో ఎక్స్ సామాజిక మాధ్యమంలో వెలువరించిన వ్యాఖ్యలను ఇప్పుడు వెలుగులోకి తీసుకువచ్చారు. తాను అప్పుడే దేశానికి వీక్ పిఎం వచ్చాడని చెప్పానని గుర్తు చేశారు. హెచ్ 1 బి వీసా నిర్ణయంతో వేలాది మంది భారతీయులపై ప్రభావం దారుణరీతిలో ఉంటుందన్నారు.

ఇక లోక్‌సభలో కాంగ్రెస్ సభాపక్షం ఉప నేత గౌరవ్ గగోయ్ ఈ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశపు అత్యుత్తమ, యువ ప్రతిభ భవితను దెబ్బతీసే విధంగా అమెరికా వ్యవహరించింది. ట్రంప్ చేష్టను మనం నివారించలేకపోయ్యాం అన్నారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కూడా ఈ విషయంపై స్పందించారు. 2017లో రాహుల్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ చూస్తే బలహీన ప్రధాని మరింత బలహీనపడిపోయాడు. అందుకు అమెరికా నుంచి సుంకాలు, వీసా పీజుల భారం వచ్చిపడుతోందని తెలిపారు. మోడీ అనేక సార్లు ట్రంప్‌తో అట్టహాసపు భేటీలకు దిగారు , అయితే ఎక్కడా వీసాల ప్రధాన సమస్యపై ఆయనతో మాట్లాడలేదనే విషయాన్ని రాహుల్ అప్పట్లోనే సామాజిక మాధ్యమం ద్వారా చెప్పాడని పవన్ ఖేరా గుర్తు చేశారు.

Also Read: భారతీయులకు షాక్ ఇచ్చిన ట్రంప్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News