Thursday, May 2, 2024

పని చేసిన సంస్థకే కన్నం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసిన నిందితుడిని మీర్‌చౌక్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.14,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… అస్సాం రాష్ట్రానికి చెందిన పున్‌పున్ డోలే నగరంలోని జామ్ జామ్ ఫాస్ట్‌నర్‌లో పనిచేస్తున్నాడు. ట్రాక్టర్ల స్పేర్‌పార్ట్‌ను సంస్థ యజమాని అబ్దుల్ లతీఫ్ విక్రయించే వ్యాపారం చేస్తున్నాడు. ఇక్కడ పున్‌పున్ డేయిలీ లేబర్‌గా పనిచేస్తూ బిల్డింగ్‌పై ఉన్న పెంట్ హౌస్‌లో ఉంటున్నాడు. కొంత కాలం నుంచి పని చేస్తున్న నిందితుడు సంస్థ యజమాని డబ్బులు పెట్టే ప్రాంతం, క్యాష్ వివరాలు తెలుసుకున్నాడు.

ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన తెల్లవారుజామును షాపు షట్టర్‌ను ఐరన్ రాడ్‌తో ఓపెన్ చేసి లోపలికి వెళ్లాడు. అక్కడ కౌంటర్‌లో ఉన్న రూ.14,50,000లను తీసుకుని పారిపోయాడు. తెల్లవారి షాపుకు వచ్చిన యజమాని సంస్థలో చోరీ జరిగిన విషయం గుర్తించాడు. వెంటనే సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించగా పున్‌పున్ చోరీ చేసినట్లు గుర్తించారు. మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని జహీరాబాద్ వద్ద పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ రవీందర్, తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News