Tuesday, May 7, 2024

బీరుతో నడిచే మోటార్‌సైకిల్

- Advertisement -
- Advertisement -
గంటకు 240 కిమీ. వేగంతో నడుస్తుంది!

మిన్నెసోటా: అమెరికాకు చెందిన వ్యక్తి తన అసాధారణ ప్రతిభతో బీరుతో నడిచే మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించాడు. కీ మైఖేల్సన్ ఇదివరలో ‘రాకెట్‌పవర్డ్ టాయిలెట్ ’, ‘జెట్‌పవర్డ్ కాఫీ పాట్’ను రూపొందించాడు. తన కొత్త ఆవిష్కరణలో గ్యాస్‌పవర్డ్ ఇంజిన్‌కు బదులుగా హీటింగ్ కాయిల్‌తో కూడిన 14గాలన్ కెగ్ ఉందని తెలిపాడు. కాయిల్ బీర్‌ను 300 డిగ్రీల వరకు వేడి చేస్తుంది. ఇది బైక్‌ను ముందుకు నడిచేలా చేసే నాజిల్‌లో సూపర్‌హీటెడ్ స్టీమ్‌గా మారుతుంది. కీ బ్లూమింగ్‌టన్‌లోని తన గ్యారేజీలో బీర్‌తో నడిచే మోటార్‌సైకిల్‌ను సృష్టించాడు.

‘ఈ మోటార్‌సైకిల్ ఖచ్చితంగా భిన్నమైంది. నేను నిజంగా సృజనాత్మకంగా ఉండాలనుకుంటున్నాను. ఇతర వ్యక్తులు గతంలో ఎన్నడూ చేయని పనులను చేయండి’ అని కెఫాక్స్9తో అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News