- Advertisement -
మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్గా ‘ధమాకా’ లాంటి భారీ సక్సెస్ తర్వాత కలిసి చేస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. దర్శకుడు భాను బోగవరపు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం విడుదల కోసం రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మే నెల నుంచి విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌పై నిర్మాత నాగవంశీ తాజాగా క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 2న దసరా పండుగ కానుకగా తాము మాస్ జాతర రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని చెప్పారు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.
- Advertisement -