Sunday, June 16, 2024

మహారాష్ట్రలో అగ్నిప్రమాదం… నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలోని ఠాణే జిల్లాలోని డోంబివిలిలో గురువారం మధ్యాహ్నం రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంటల చెలరేగడంతో నలుగురు సజీవదహనమయ్యారు. ఈ అగ్నిప్రమాదంలో మరో 45 మందిపైగా తీవ్రంగా గాయపడ్డారు. సిబ్బంది సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికిచేరుకొని మంటలను ఆర్పేశాయి. గాయపడిన 45 మందిని ఆస్పత్రికి తరలించారు. అంబర్ రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలడంతోనే ఈ అగ్ని ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు దెబ్బతిన్నాయి. గాయపడిన వారిలో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News