Sunday, June 16, 2024

ఇసి ఆదేశాలు తీవ్రమైన తప్పు

- Advertisement -
- Advertisement -

అగ్నివీర్ పథకంపై చిదంబరం వివరణ

న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకాన్ని రాజకీయం చేయవద్దంటూ కాంగ్రెస్ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడాన్ని తీవ్రమైన తప్పుగా మాజీ కేంద్ర మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు పి చిదంబరం అన్నారు. ప్రభుత్వ విధానాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్ష పార్టీకి ఉందని ఆయన స్పష్టం చేశారు. కుల, మత, భాష, మతపరమైన అంశాలపై ప్రచారం చేయరాదని ఆదేశిస్తూ ఎన్నికల సంఘం బుధవారం అధికార బిజెపి, ప్రతిపక్షాలను ఆదేశించింది. అంతేగాక రక్షణ దళాలను రాజకీయ ం చేవద్దని, సాయుధ దళాల సామాజిక ఆర్థిక కూర్పుకు సంబంధించి చీలికలు తెచ్చే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని కాంగ్రెస్ పార్టీని ఇసి ఆదేశించింది.

అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నాయకులు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఇసి ఈ ఆదేశాలు జారీచేసింది. దీనిపై చిదంబరం గురువారం స్పందిస్తూ..రాజకీయం అంటే ఏమిటని, విమర్శించడమని మీ ఉద్దేశమా అని ఇసిని ప్రశ్నించారు. అగ్నివీర్ అన్న పథకం ప్రభుత్వ విధాన నిర్ణయం నుంచి ఏర్పడిందని, ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్ష పార్టీకి ఉంటుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పథకాన్ని రద్దు చేస్తామని చెప్పడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News