Friday, May 3, 2024

2024జట్టు సిద్ధం

- Advertisement -
- Advertisement -

Massive purge in the Congress party

వచ్చేనెలలో ఎఐసిసిలో భారీ కుదుపు
సోనియా కార్యాచరణ ఆరంభం
మకెన్ , జోషీలు ప్రధాన కార్యదర్శులు
నవంబర్‌లో రాహుల్ సెక్రెటరీ జనరల్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో భారీ స్థాయి ప్రక్షాళనకు రంగం సిద్ధం అయింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల చేదు ఫలితాలతో అధ్యక్షురాల సోనియా గాంధీ చర్యలు చేపట్టారు. వచ్చే నెలలో భారీస్థాయిలో ఎఐసిసిలో మార్పులు చేర్పులకు దిగాలని సోనియా గాంధీ సంకల్పించారు. పరాజయానికి కారకులుగా నిర్థారిస్తూ ఇప్పటికే ఆయా రాష్ట్రాల పిసిసి అధ్యక్షులపై వేటేశారు. కొందరు రాజీనామాలకు దిగారు. లోక్‌సభ ఎన్నికలు, ఇటీవలి రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో విస్తృతస్థాయి కుదుపు ఇదే అవుతోంది. వచ్చే నెలలో ఎప్పుడైనా పార్టీ ప్రధాన విభాగం అయిన ఎఐసిసిలో భారీస్థాయి మారుపలు ఉంటాయని, సోనియా తరువాత ఇప్పటిలాగానే రెండో ప్రధాన బాధ్యతలలో రాహుల్ గాంధీ ఉంటారని వెల్లడైంది. గత లోక్‌ఐసభ ఎన్నికలలో పార్టీ కేవలం 44 స్థానాలను దక్కించుకుని సంతృప్తి చెందాల్సి వచ్చింది. పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు, త్వరలో జరిగే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తరువాత 2014 లోక్‌సభ ఎన్నికలను లక్షంగా ఎంచుకునే పార్టీలో సమూల ప్రక్షాళనకు సోనియా సిద్ధం అయ్యారు.

ఇందులో భాగంగా ముందు జి 23 అసమ్మతి నేతల అసంతృప్తిని చల్లార్చేందుకు స్వయంగా సోనియా తోడుగా రాహుల్ రంగంలోకి దిగారు. గులాం నబీ ఆజాద్‌తో భేటీ ఈ దిశలోనే జరిగింది. 2024 లోక్‌ఐసభ ఎన్నికల టీం రూపు దిద్దుకొంటోంది. సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత విధేయులు అయిన అజయ్ మకెన్, సిపి జోషీలను ఎఐసిసి ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. త్వరలోనే రాహుల్ గాంధీ పార్టీలో మరింతగా క్రియాశీలక పాత్ర వహిస్తారు. అయితే తేది సమయం తాను చెప్పలేనని పార్టీ సీనియర్ నేత జనార్ధన్ ద్వివేది విలేకరులతో తెలిపారు. రాహుల్ ఈ ఏడాది నవంబర్ 2న పార్టీ సెక్రెటరీ జనరల్‌గా బాధ్యతలు తీసుకుంటారనే వార్తలపై ద్వివేది స్పందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News