Sunday, September 15, 2024

పెళ్లి చేయలేనని.. తొమ్మిదేళ్ల కూతురుని చంపిన తండ్రి

- Advertisement -
- Advertisement -

వెల్దుర్తి: మెదక్ జిల్లా వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని ఓ కుటుంబానికి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో పెద్దయితే కూతురికి పెళ్లి చేయాలేనని బెంగతో ఆమెను కన్నతండ్రి చంపేశాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం….   శేరిల గ్రామంలో ఇక్కిరి సౌందర్య, శ్రీశైలం దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె నిఖిత (9) ఉన్నారు. శ్రీశైలం కుటుంబం చాలాకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో ఎప్పుడో చేయాల్సిన కూతురి పెళ్లి గురించి శ్రీశైలం అతిగా ఆలోచించాడు. కూతురు పెద్దయిన తరువాత పెళ్లి చేయడం కష్టమేనని ఆమెను చంపేయడమే సమస్యకు పరిష్కారంగా భావించాడు. మే 31న కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తీసుకొచ్చి నిఖితతో తాగించాడు. తీవ్ర అస్వస్థతకు గురైన నిఖితను కుటుంబసభ్యులు హైదరాబాద్ లో నిలోఫర్ ఆస్పత్రిలో చేర్చారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో  చికిత్స పొందుతూ జూన్ 3న మృతి చెందింది. నిఖిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. శవ పరీక్షలో బాలిక విషం తీసుకోవడంతోనే చనిపోయిందని తేలడంతో తండ్రిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News