Monday, June 17, 2024

పరువునష్టం కేసులో మేధా పట్కర్ దోషి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా దాఖలు చేసిన పరువునష్టం కేసులో నర్మతా బచావో ఆందోళన్ (ఎన్‌బిఎ) నాయకురాలు మేధా పట్కర్‌ను దోషిగా ఢిల్లీలో ఒక కోర్టు శుక్రవారం నిర్ధారించింది. నేరపూరిత పరువునష్టం దావాలో మేధా పట్కర్‌ను దోషిగా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాఘవ్ శర్మ తేల్చారు. సంబంధిత చట్టం ప్రకారం ఆమెకు రెండు సంవత్సరాల కారాగార శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

సక్సేనా, పట్కర్ మధ్య 2000 నుంచి న్యాయ పోరు సాగుతోంది. తనపైన, నర్మదా బచావో ఆందోళన్‌పైన వాణిజ్యప్రకటనలు ప్రచురించినందుకు సక్సేనాపై ఆమె దావా వేశారు. సక్సేనా అప్పుడు అహ్మదాబాద్‌కు చెందిన ఎన్‌జిఒ జాతీయ పౌర హక్కుల మండలి (ఎన్‌సిసిఎల్) చీఫ్‌గా ఉన్నారు. ఒక టివి చానెల్‌లో తనపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు, పరువు నష్టం కలిగించే పత్రికా ప్రకటన జారీ చేసినందుకు ఆమెపై సక్సేనా రెండు కేసులు దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News