Thursday, May 2, 2024

జలవిద్యుత్ కేంద్రం నిర్మాణంలో మెఘాకు మరో రికార్డు

- Advertisement -
- Advertisement -

Megha record in construction of hydro electric plant

 

మనతెలంగాణ/హైదరాబాద్:  భారీ ప్రాజెక్టుల నిర్మాణరంగంలో పేరుగాంచిన మెఘా జింజనీరింగ్ సంస్థ మరో రికార్డును సొంతం చేసుకుంది. గోదావరి నదిపై నిర్మిస్తున్న పొలవరం బహుళార్ధసాధక ప్రాజెక్టులో జలవిద్యుత్ కేంద్రం టన్నల్ తవ్వకాల్లో ఈ రికార్డును సాధించింది. జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో కార్మికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. 2020మార్చి నుండి ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వరకూ 4మిలియన్ సేఫ్ మెన్ అవర్స్ సర్టిఫికెట్‌ను పొందింది. జలవిద్యుత్‌కేంద్రంలో భాగంగా ఉన్న కొండ తవ్వకం పనుల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పనులు పూర్తి చేసినందుకు జలవనరుల శాఖ నుండి ఈ సర్టిఫికెట పొందింది.

కొండను తొలిచి సొరంగమార్గం నిర్మాణ పనుల్లో ఎటువంటి భద్రతా పరమైన లోపాలు తలెత్తకుండా పనులు సాగించింది. కార్మికుల భద్రత కోసం ప్రాజెక్టులో ప్రత్యేకమైన సేఫ్టీ విభాగం ఏర్పాటు చేసుకుంది. ఎప్పటికప్పుడు కార్మికుల భద్రతకు అవసరమైన పటిష్టమైన చర్యలు చేపట్టింది. జలవిద్యుత్ కేంద్రం కొండను తొలిచి టన్నల్ నిర్మించటంలో అధునాతన సాంకేతికతను వాడిన మెఘా ఇంజనీరింగ్ సంస్థ తన నైపుణ్యతను ప్రదర్శించి భధ్రతా చర్యలు చేపట్టినందుకుగాను 5మిలియన్ సేఫ్‌మెన్ సర్టిఫికెట్‌ను పొందగలిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News