Friday, May 3, 2024

మేష రాశివారికి విదేశీయానం అనుకూలం

- Advertisement -
- Advertisement -

మేషరాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వివాహాది శుభకార్యాలు ఓ కొలిక్కి వస్తాయి. గురువు, శని గ్రహ అనుకూల ప్రభావం చేత సమాజంలో స్థాయి, పరపతి పెరుగుతుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో అభివృద్ధి కానవస్తుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మంచి నూతన ఉద్యోగం లభిస్తుంది. వృత్తిఉద్యోగాలలో సంతృప్తికరంగా (జాబ్ సాటిఫికేషణ్) ఉంటుంది. గురువు జన్మరాశి యందు తదుపరి వృషభ రాశి యందు సంచారం, శని కుంభ రాశి యందు సంచారం.

గురు, శుక్ర మౌఢ్యాలు ప్రధాన ఫలితాలను నిర్ధేశిస్తున్నాయి. కుటుంబం కొరకు ఎక్కువగా ఖర్చు పెడతారు. ఖర్చులు తగ్గించుకోవాలని ఎంత ప్రయత్నాలు చేసినా సఫలీకృతం కాలేరు. కొన్ని వివాహ సంబంధాలు దగ్గరకు వచ్చి చేజారిపోతాయి. ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా మంచి సంబంధం కుదురుతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఆధ్యాత్మిక రంగంలో రాజకీయా ల కారణంగా కొన్ని చేదు అనుభవాలు ఏర్పడతాయి. దొంగ స్వామిజీలను నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. పొరపాటున తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నందుకు మిమ్మల్ని మీరే నిందించుకుంటారు. సామాజికంగా ఏర్పడిన పరిస్థితుల దృశ్య సంతాన విషయాలలో ఎక్కువ శ్రద్ద కనపరుస్తారు. వ్యవసాయ రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయ సంబంధమైన నల్ల నువ్వులు, పత్తి, అపరాలు, వ్యాపారులకు ఈ ఏడాది లాభిస్తాయి.

ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు (ప్రమోషన్) వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కళాసాంస్కృతిక, క్రీడా రంగాలలో మీ ప్రతిభా పాటవాలు గుర్తింపుకు నోచుకుంటాయి. నూనె సంబంధమైన ఖనిజ సంబంధమైన వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. పాల ఉత్పత్తులు, నీరు, కొబ్బరి తత్త్ సంబంధమైన వ్యాపారాలకు అనుకూలమైన కాలం. గృహంలో ఈ సం వత్సరం శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతానం వలన కొంత సౌఖ్యం కలుగును. ప్రభుత్వ సం బంధిత కార్యాలు పూర్తిచేస్తారు. శని బలం వలన ప్రమోషన్స్‌తో కూడిన బదిలీలు మీకు అను క్ను చోటుకు అవుతారు. వర్క్ పర్మినెంట్ కాని వారికి పర్మినెంట్ అవుతుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలోని వారికి అనుకూల కాలం, బంగారం, వెండి వ్యాపారస్తులకు మంచి అనుకూల సమయం అని చెప్పవచ్చును. కుటుంబంలో నూతన వ్యక్తులు రావడం జరుగుతుంది.

ఉన్నత విద్యావంతులకు, నిరుద్యోగులకు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా చిన్న చిన్న ఉద్యోగాలు లభించినా కూడా మొత్తం మీద కొంత వరకు ఊరట లభించి ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగం ఏదై నా బాద్యతతో నిబద్ధతతో మీరు కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. తద్వారా మీ శ్రమకు తగిన గుర్తింపు ఆలస్యంగా అయినా దక్కుతుంది. నూతన అవకాశాలు కూడా తారసపడతాయి. ఒక మంచి ఉద్యోగాన్ని, మంచి స్థానాన్ని సాధిస్తారు.

సంతానసంబంధమైన విషయాలలో క్రమశిక్షణ చాలా అవసరం. సంతాన విషయంలో ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటారు. సంతానం ప్రవర్తన, వాళ్ళ చదువు, వాళ్ళ నడవడిక ఇవన్నీ మీ మానసికమైన ఆందోళనకు కారణమవుతాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మంచి ఉద్యోగం సాధించగలిగామన్న సంతృప్తిని కలిగి ఉంటారు. ఐ.ఐ.టి, మెడిసిన్ సీటు సాధిస్తారు. గతంలో జరిగిన తప్పిదాలను తిరిగి జరగకుండా జాగ్రత్త వహిస్తారు. విదేశాలకు సంబంధించిన అంశాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. విదేశాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా వుంది. గ్రీన్‌కార్డు, హెచ్1బి వీసా, పి.ఆర్. లభిస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం కూడా లభిస్తుంది.

మొత్తం మీద ఈ సంవత్సరం అభివృద్ధి దిశగా ఉం టుంది. ఈతలు, పిక్నిక్‌లు, బైక్ రైడింగ్‌లు ఇలాంటివి మీకు అంతగా కలిసిిరావు. సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. వివాహ విషయాలు ఈ సంవత్సరం కొంత విసుగు, చిరాకు కలిగిస్తాయి. అయినా కూడా మీకు మంచే జరుగుతుంది. సంవత్సరం ద్వితీయార్ధంలో ఆకస్మికంగా సంబంధం కుదురుతుంది. వివాహానికి ముందు తప్పనిసరిగా వ ధూవరుల జాతక పరిశీలన చేసుకుని వివాహం చేసుకొనుట మంచిది. నమ్మిన వ్యక్తి ఆశ్చర్యంగా మోసం చేయడం జరుగుతుంది. ప్రేమ వివాహాల పట్ల నమ్మకం పోతుంది. (ఇది కొద్దిమంది విషయంలో మాత్రమే అందరికీ కాదు). ద్వితీయ వివాహం చేసుకోవాలని ప్రయత్నించే వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు.

ప్రేమ వివాహాలు అంతగా లాభించవు. గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా ఉండాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. అవివాహితులకు వివాహానికి అనుకూల కాలం. ఈ సంవత్సరం కుటుంబంలో కొన్ని అరమరికలు సంభవిస్తాయి. భార్యభర్తల మధ్య అనుకోని మాట పట్టిం పులు ఎదురవుతాయి. ఎక్కువ తక్కువ అనే భా వన, ఆర్థిక లావాదేవీల విషయంలో మాటమా ట పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇది అందరి విషయంలో కాదు. కుటుంబలో కొంత మానసిక అశాంతి నెలకుంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి.

కుటుంబ సభ్యులతో సఖ్యత లోపిస్తుంది. మీవారే శత్రువులుగా మారే అవకాశాలు ఉన్నాయి. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సోదరీసోదర వర్గంతో మాటపట్టింపులు ఉంటాయి. కాని అవి శాశ్వతంగా అయితే ఉండవు. మీరు చేయాల్సిన బాధ్యతలు సక్రమంగా చేసినా కూడా వారికి రుచించవు. ఏదో తక్కువ చేసారనే భావన వారిలో ఉంటుంది. సహోదర సహోదరీవర్గంతో నిష్కారణ విభేదాలు ఏర్పడతాయి. కుటుంబంలో విషబీజం నాటే వ్యక్తులు మీకు అత్యంత ఆత్మీయులు అవుతారు. నిష్కారణమైన తగాదాలు, స్పర్థలు చోటు చేసుకోవడం ప్రారంభమవుతుంది. గమనించుకోంటూ ఉండాలి.లేదంటే దూరం పెరిగే అవకాశాలు లేకపోలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News