Monday, May 6, 2024

విద్యల వీణ తెలంగాణ

- Advertisement -
- Advertisement -

 

ప్రపంచంతో పోటీ పడే విధంగా నాణ్యమైన విద్యను అందిస్తాం
తెలంగాణలో అత్యధికంగా 940 గురుకులాలు
దేశంలో రైతన్నకు ఎక్కడా ఉచిత కరెంటు లేదు
సిరిసిల్ల నియోజకవర్గంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి/ గంభీరావుపేట : అన్ని మౌలిక వసతులతో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేలా సిరిసిల్ల నియోజకవర్గంలోని పాఠశాలలు రూపుదిద్దుకొని రాష్ట్రంలో ముందువరుసలో నిలుస్తున్నారని రాష్ట్ర పురపాలక, ఐటి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం విస్తృతంగా పర్యటించి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా గంభీరావుపేట మండలంలో డిగ్రీ కళాశాల, జడ్పీ ఉన్నత పాఠశాల, తాతనానమ్మల జ్ఞాపకార్థం నిర్మించిన రైతు వేదికను ప్రారంభించి అనంతరం మండల కేంద్రంలో స్వయంగా ఇంటి కి కల్యాణలక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. తదనంతరం నర్మాలలో, మల్లన్నపేట, మ ల్లారెడ్డి పేటల్లో రైతు వేదిక, డ్యాంకు భూమి పూజ, కొత్తపల్లిలో మహిళా సంఘ భవనం, శ్మశాన వాటికలను కూడా మంత్రి ప్రారంభించారు.

నర్మాల గ్రామశివారులో అగస్త సూపర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మా ట్లాడుతూ గంభీరావుపేట మండల కేంద్రంలో 2 కోట్ల 25 లక్షల రూపాయలతో నూతనంగా పభు త్వ డిగ్రీ కళాశాల భవనాన్ని నిర్మించుకోవడం చా లా సంతోషదాయకం అన్నారు. గంభీరావుపేటలో శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి కేజీ టూ పీజీ ఒకే ఆవరణలో ఉండే విధంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసే బాధ్యత తనదని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థినుల కోసం హాస్టల్‌ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలన్నారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో అత్యధికంగా 940 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి విద్యార్థికి సన్నబియ్యంతో భోజనం పెట్టే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు జ్యోతిబాపులే, అంబేద్కర్ ఓవర్సీస్ కింద ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నామని తెలిపారు. సినారే పేరు మీద ఏర్పాటు చేసిన లైబ్రరీ పోటీ పరీక్షలకు వేదికగా మారిందన్నారు.

రైతుల సంక్షేమమే టిఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయం..

రైతుల సంక్షేమమే టిఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయం అని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతుబంధును ప్రారంభించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతులకు రైతుభీమా ద్వారా తెలంగాణ ప్రభుత్వం భీమా అందజేస్తోందన్నారు. 66 వేల కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతుల గడప వద్దనే ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. సుమారు కోటిన్నర ఎకరాలకు రైతుబంధు ఇస్తున్నామన్నారు. తెలంగాణలో 4 రకాల విప్లవాలు కనపడుతున్నవని, రెండవ హరిత విఫ్లవం, నీలి విఫ్లవం, శ్వేత విఫ్లవం, గులాబీ విఫ్లవం అని పేర్కొన్నారు. ఆహార ఉత్పత్తులను దేశ విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలన్నారు.

స్థానిక నాయకులు పరిశ్రమల స్థాపకు పూర్తిస్థాయిలో సహకరించి ఈ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి జరిగేందుకు కృషి చేయాలన్నారు. మిడ్ మానేరు నిర్వాసితులకు జీవన ఉపాధి కల్పించేందుకు వారి ప్రాంతంలో మినీ డెయిరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు కృషి చేస్తా అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతానన్నారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ ఛైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవరెడ్డిలతో కలిసి ప్రారంభించారు.

నానమ్మతాతల జ్ఞాపకార్థం రైతు వేదిక ..

గంభీరావుపేట మండల కేంద్రంలో మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తన నానమ్మ తాతలైన కీ.శే. కల్వకుంట్ల వెంకటమ్మ-రాఘవరావుల పేరిట ప్రభుత్వ భూమిలో తన స్వంత ఖర్చులతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. రైతు వేదికలు రైతులకు విజ్ఞానాన్ని అందించే కేంద్రాలుగా నిలుస్తాయని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నకు సిఎం కేసీఆర్ అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారన్నారు.

వేగంగా అనుమతులు ..

రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి వచ్చే వారికి వేగంగా అనుమతులు ఇవ్వడం జరుగుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టిఎస్ ఐపాస్ ద్వారా 14 లక్షల మందికి ఉపాధిని కల్పించామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ స్కిల్, రీ స్కిల్, అప్ స్కిల్ ఉండాలన్నారు. నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. సొంతంగా పరిశ్రమలు పెట్టేవారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉత్సాహవంతుల కోసం టీ హబ్ ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ఇంటికి వెళ్లి కల్యాణలక్ష్మీ చెక్కుల అందజేత ..

గంభీరావుపేట మండల కేంద్రంలో మంత్రి కెటిఆర్ లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి కల్యాణలక్ష్మీచెక్కులను వారికి అందజేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్‌కు, మంత్రి కెటిఆర్‌కు లబ్ధిదారులకు కృతజ్ఞతలు తెలిపారు. అక్కడే ఒక వృద్ధురాలు మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ సమస్యను పరిష్కరించాలని కోరడం జరిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News