Friday, May 3, 2024

రైతులకు అండగా మంత్రి నిరంజన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -
  • వ్యవసాయ పొలాల బాటలకు రూ.1.35 కోట్ల నిధులు మంజూరు
  • సంతోషం వ్యక్తం చేసిన రైతులు, బిఆర్‌ఎస్ నేతలు

వనపర్తి ప్రతినిధి: రైతు సంక్షేమమే లక్షంగా నిరంతరం రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అండగా ఉంటున్నారని జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజప్రకాష్ రెడ్డిలు అన్నారు.

మంగళవారం పెద్దమందడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రైతుల అభ్యర్థన మేరకు వ్యవసాయ పొలాల బాటలకు పెద్దమందడి మండలానికి ఒక కోటి 35 లక్షల 80 వేల నిధులను వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధుల నుంచి మంజూరు చేయడం జరిగిందని వారు వెల్లడించారు. పెద్దమందడి మండలం పరిధిలోని అల్వాల గ్రామానికి పెద్ద చెరువు అలుగు నుంచి ఏముకుంట లక్ష్మమ్మ పొలం వరకు ఒక కిలోమీటర్ బాటకు రూ.25 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.

అదే విధంగా అమ్మపల్లి గ్రామపంచాయితీ బీటీ రోడ్ నుంచి గట్టు కాడి తాండ వరకు రోడ్డు కోసం రూ.12లక్షలు, బలిజపల్లి గ్రామపంచాయితీ పరిధిలో ఎర్రకుంట కాల్వ నుంచి గజ్జలమ్మ కుంట వరకు మూడు కిలోమీటర్ల రోడ్డుకు రూ.24 లక్షలు, చిలకటోని పల్లి గ్రామంలో గ్రామపంచాయితీ ట్రాన్స్‌ఫారం నుంచి శ్రీనివాస్ గౌడ్ పొలం వరకు రోడ్డు కోసం రూ.6 లక్షలు, మద్దిగట్ల గ్రామ పంచాయితీలో గ్రామపంచాయితీ రోడ్ నుంచి బుడల వెంకటయ్య భూమి వరకు రోడ్డుకు 4.8 లక్షలు, మునిగిళ్ళ గ్రామపంచాయితీ పరిధిలో కొండా రవి పొలం నుంచి బుగ్గపల్లి తండా వరకు రోడ్డు కోసం రూ.12 లక్షలు, అదేవిధంగా మోజర్ల గ్రామం నుంచి చెరువు అలుగు వరకు రోడ్డు కోసం రూ. 8 లక్షలు మంజూరు చేశారని తెలిపారు.

మోజర్ల నుంచి మణిగిల్ల శివారు వరకు 2.25 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.20 లక్షలు, పెద్దమందడి మండల కేంద్రంలో ఎంపీడివో ఆఫీస్ నుంచి వ్యవసాయ పొలాల రోడ్లకు రూ.24 లక్షలు మంజూరు చేశారని అన్నారు. ఈ విధంగా పెద్దమందడి మండలంలోని వివిధ గ్రామాలకు మొదటి విడతగా ఒక కోటి 35 లక్షల 80 వేలు మంజూరు చేసినందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ప్రతిపాదనలు పంపిన మిగిలిపోయిన గ్రామాలకు కూడా నిధులు త్వరలో మంజూరు అవుతాయని అన్నారు.

వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు భీమా , రుణమాఫీ వంటి పథకాల ద్వారా రైతాంగానికి అండగా ఉన్న ప్రభుత్వం నేడు వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లను కూడా మంజూరు చేయడం సంతోషకరమన్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వానికి, వనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ప్రజలు, రైతులందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, గొర్రెల కాపరుల సహకార సంఘం డైరెక్టర్ నాగేంద్రం యాదవ్, మణిగిల్ల ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ కొండా రవీందర్ రెడ్డి ,నాయకులు రాంరెడ్డి ,రఘు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News