Thursday, May 2, 2024

ఓడిపోయిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చిన ఘనత కెసిఆర్‌దే: పువ్వాడ

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఓడిపోయినా వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌ది అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలో నెహ్రూనగర్ లో జరిగిన చౌదరి ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ కొందరికి కడుపు నొప్పి వస్తే అందరికి కడుపు నొప్పి రావాలి అని కొందరు భావిస్తున్నారని, అది వారి స్వార్ధ రాజకీయాల కోసం బలి పెడదాం అని అనుకుంటే అందుకు తాము సిద్ధంగా లేమన్నారు. కొందరికి ఒక్కసారి అవకాశం ఇస్తే దానిని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ సమయానుకూలంగా అందరికి అవకాశాలు రావాలి అని కోరుకోవాలని ఆయన అన్నారు. యువకులు రాజకీయాలలోకి రావాలి అంటే మాలాంటి వాళ్ళకు అవకాశం ఇస్తేనేగా వచ్చేది, కెసిఆర్‌ కూడా ఇంకొక తరాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఆయనపై ఉందన్నారు.

సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో ఒక్కసారి ఖమ్మంకు మంత్రి పదవి వచ్చినందుకే ఇంత అభివృద్ధి చేసుకున్నాం ఇప్పుడు రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ముందు ఉంది, దానిని వెనుకకు నెట్టాలి అని కొందరు కలలు కంటున్నారని ఆయన అన్నారు. తాను గెలిచినా ఇక్కడనే ఉంటా, ఓడిపోయినా ఇక్కడే ఉంటా కాని కొందరు అలా కాదని ఒక్కసారి ఖమ్మం వైపు చూసి మరోసారి పాలేరు వైపు పోదాం అనే ఆలోచన చేస్తారని ఆయన అన్నారు. తాను ఇక్కడ భూమి పుత్రుడిని, అని స్థ్దానికుడైన తనకు మరోసారి అవకాశం కల్పించేందుకు ఆశీర్వదించాలని కోరారు. రూమర్స్, గోబెల్ ప్రచారాల ద్వారా మనల్ని ఆగం చేయాలి అని చూస్తున్నారు వారి పట్ల తస్మాత్ జాగ్రత్త గా ఉండాలని మంత్రి సూచించారు. ఈ సభలో పాల్గొన్న సిపిఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వర్ రావు మాట్లాడుతూ ఖమ్మం ప్రజల ఆశీస్సులతో మరోసారి అజయ్ గెలవడం ఖాయమనే దీమాను వ్యక్తం చేశారు.

గెలిపిస్తే మన అందరి బాగోగులు చూసుకుంటాడని కనుక మరోసారి ఆశీర్వదించాలని కోరారు. అజయ్ అందరివాడే గాని, కొందరివాడు కాదన్నారు. ఖమ్మంను అభివృద్ధి చేయడంలో అజయ్ జయప్రదం అయ్యాడని, ఖమ్మానికి మరింత చేయాల్సి ఇంచా చాలా ఉందని కనుకే మూడోసారి కూడా అజయ్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. అజయ్ అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగుతున్నాడని తాను ఆశీర్వదిస్తున్న, మీరు కూడా ఆశీర్వదించండి విజయమే మనకు పరిష్కార మార్గం “అని ఆయన అన్నారు. కమ్మ మహాజన సంఘం నాయకులు దండా పుల్లయ్య అధ్వర్యంలో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో గరికపాటి వేంకటేశ్వరరావు, పొట్ల మాధవరావు, వల్లభనేని రామారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News