- Advertisement -
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని రాష్ట్ర మహిళలకు సిఎం రేవంత్ రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సోదరి సీతక్క పట్ల ఉన్న అనురాగాన్ని ప్రతిబింబిస్తూ ట్విట్టర్ వేదికగా సిఎం రేవంత్‌రెడ్డి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అక్షరాలతో రచించలేనిది, మాటలతో నిర్వచించలేనిది సీతక్కతో నా అనుబంధమని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి రాఖీ పౌర్ణమి నాడు ఆ బంధం మరింతగా వికసిస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సీతక్కతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ట్విట్టర్ వేదికగా సిఎం రేవంత్ ఎమోషనల్ అయ్యారు. తనకు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ, సీనియర్ నాయకురాలు గీతారెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాతలకు సిఎం ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -