Sunday, April 28, 2024

22 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహానగరంలోని నెక్లెస్ రోడ్డులో కొత్తగా 22 ఎలక్ట్రిక్ బస్సులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఎలక్ట్రిక్ బస్సులన్నీ నాన్ ఎసి బస్సులు అని గ్రేటర్ అధికారుల తెలిపారు. పాత మెట్రో బస్సుల స్థానంలో వీటిని తీసుకొచ్చామని వివరించారు. ఈ బస్సుల్లోనూ మహిళలు ఆధార్ కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపారు. మియాపూర్, హెచ్‌సియు, బిహెచ్‌ఇఎల్, రాణిగంజ్, కంటోన్మెంట్ డిపోల్లో 33 కెవి పవర్ లైన్ల సహాయంలో ఈ బస్సులకు ఛార్జీంగ్ చేయనున్నారు. ఆగస్టు నెలలో అద్దె ప్రాతిపదికన 500 బస్సులను ఆర్‌టిసి సంస్థ రన్ చేయనుంది. ఆర్‌టిసి సంస్థ సొంతంగా మరో 565 డీజిల్ బస్సులను కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. మరో 440 బస్సుల్లో 300 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు కాగా 140 ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. అన్ని బస్సులలో మహిళలు ఉచిత ప్రయాణం చేయాలని ఆర్‌టిసి సంస్థ సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News