Thursday, June 13, 2024

మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రుల బృందం

- Advertisement -
- Advertisement -

Medaram jatara

 

హైదరాబాద్: మేడారం జాతర ఏర్పాట్లను రాష్ట్ర మంత్రుల బృందం శనివారం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా క్షేత్ర స్థాయి పర్యటన జరిపారు. ఈ మేరకు ఉదయం బేగంపేట్ విమానాశ్రయం నుండి మేడారం బయలుదేరి వెళ్ళారు. ఈ పర్యటనలో రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు మేడారం జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.75కోట్ల నిధులను మంజూరు చేసిన విషయం చేసింది. ఈ సందర్భంగా జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా రహదారులు, ఇతరత్రా పనులు వేగంగా జరుగుతున్నాయి.

Ministers who Examined Medaram jatara Arrangements
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News