Saturday, July 27, 2024

పాడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంది: తలసాని

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/యాదాద్రిభువనగిరి: రాష్ట్రంలోని పాడి రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.4 ఇన్‌సెంటివ్ ఇచ్చిన దయగల మహరాజు సిఎం కేసీఆర్ అని అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపూర్ గ్రామంలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 5కోట్ల రూపాయలు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. రైతులకు సబ్సిడీపై 65వేల పాడిగేదెలు పంపిణీ చేశామని తెలిపారు. జీవాలకు ఉచితంగా వ్యాక్సిన్‌లు వేసే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. జీవాలు ఆరోగ్యంగా ఉంటేనే రైతులకు మేలు కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలో 84లక్షల పశువులు, గేదెలకు టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. టీకాల పంపిణీ కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగుతుందన్నారు. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుతో తెలంగాణ రాష్ట్రం దేశంలో అభివృద్ధిలో ముందుందని మంత్రి వెల్లడించారు. కాగా ఆలేరు నియోజకవర్గంలో గొర్రెల మార్కెట్, చేపల మార్కెట్ ఏర్పాటుచేస్తామన్నారు. కానీ స్థలం మాత్రం స్థానికులే చూసుకోవాలని అన్నారు. రైతులు పాల ఉత్పత్తులు కూడా ప్రభుత్వానికి సంబంధించిన డైరీలకే ఇవ్వాలని మంత్రి తలసాని విజ్ఞప్తి చేశారు. దసరా తర్వాత ప్రపంచమంతా యాదాద్రికే వస్తుందన్నారు. యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయాన్ని ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

Govt Support to Dairy Farmers: Minister Talasani

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News