Sunday, April 28, 2024

ఆ విషయాన్ని పెద్దగా ఆలోచించలేదు

- Advertisement -
- Advertisement -

‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ కీర్తిసురేశ్ టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ ఇండియా’. నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 4న ప్రముఖ డిజిటల్ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా కీర్తిసురేశ్ మాట్లాడుతూ “మిస్ ఇండియా’.. ఓటీటీలో విడుదలవుతున్న నా రెండో చిత్రమిది. ప్రస్తుతం సినిమా రంగంలో నెలకొన్న పరిస్థితులు అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను ప్రేక్షకులకు చేర్చడమెలా అనేది ముఖ్యం. ఆ కోణంలో చూస్తే ఓటీటీలో ’మిస్ ఇండియా’ విడుదల కావడం నాకు సంతోషాన్నిచ్చే విషయమే. ‘మహానటి’ తర్వాత నేను కమర్షియల్ సినిమాలు చేయడానికి కూడా ఆసక్తిగా ఉన్న సమయంలో నాకు ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయమని అవకాశాలు వచ్చాయి. ఆ క్రమంలోనే నచ్చిన సినిమాలు ఓకే చేశాను. విదేశాల్లో ఎక్కువగా కాఫీ తాగడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి దేశానికి మన దేశం నుండి వెళ్లిన ఓ అమ్మాయి టీ బిజినెస్‌ను ప్రారంభిస్తుంది. బిజినెస్ రంగంలో రాణించాలని ఆ మధ్య తరగతి అమ్మాయి చాలా కలలు కంటుంది. టీ బిజినెస్ ప్రారంభించినప్పుడు ఆమెకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఆమె ఎలా అధిగమించి సక్సెస్ అయ్యిందనేదే ‘మిస్ ఇండియా’ సినిమా.

ఓ అమ్మాయి ఛాలెంజింగ్ జర్నీనే ఈ సినిమా. నిజానికి ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైనప్పుడు ఈ సినిమా అందానికి సంబంధించిన సినిమా అయి ఉంటుందేమోనని అందరూ ఆనుకున్నారు. కానీ ట్రైలర్ విడుదలైన తర్వాత అందరికీ క్లారిటీ వచ్చింది. నరేంద్రనాథ్‌కి డైరెక్టర్‌గా తొలి సినిమా. అయితే నేను ఆ విషయాన్ని పెద్దగా ఆలోచించలేదు. స్క్రిప్ట్ ఎలా ఉందని చూశాను. సినిమాపై తనకున్న ఆసక్తి, విజన్ నచ్చింది. అందుకనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ‘మహానటి’ తర్వాత వర్కవుట్ చేయడం మొదలు పెట్టాను. అయితే ఇంత స్లిమ్‌గా కావడానికి ‘మిస్ ఇండియా’ కూడా ఓ కారణమని చెప్పొచ్చు. సినిమాలో సన్నగా ఉండాలి, ఏ డ్రెస్ వేసినా బావుండాలని డైరెక్టర్ చెప్పడంతో బరువు తగ్గాను. నవంబర్ 4న ‘మిస్ ఇండియా’ విడుదలవుతుంది. దీని తర్వాత ‘గుడ్‌లక్ సఖి’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక సర్కారు వారి పాట, అణ్ణాత్తే సినిమాల్లో నటిస్తున్నాను. వీటితో పాటో ఓ తమిళ చిత్రం, రెండు తెలుగు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి”అని ఆమె తెలిపారు.

Miss India movie to released on Nov 4

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News