ముంబై: బిసిసిఐ అధ్యక్ష పదవి (BCCI Pesident) కోసం మరి వారం రోజుల్లో భారత క్రికెట్ బోర్డు ఎజిఎం జరగనుంది. ఈ మీటింగ్ తర్వాత కొత్త అధ్యక్షుడు ఎవరు అనే విషయం తేలిపోనుంది. ఈసారి అధ్యక్ష పదవి కోసం పలువురు మాజీల పేర్లు వినిపించాయి. తొలుత సచిన్ టెండూల్కర్ పేరు వినిపించినప్పటికీ.. ఆయన టీం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది. ఆ తర్వాత మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారని పుకార్లు వచ్చాయి. తాజాగా ఈ లిస్ట్‌లో మరో ఆటగాడు చేరారు.
ఇప్పటివరకూ బిసిసిఐ అధ్యక్షుడిగా ( చేసిన వాళ్లు దాదాపుగా భారత్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడిన వాళ్లే. కానీ, తొలిసారిగా ఒక అంతర్జాతీయ మ్యాచ్ ఆడని వ్యక్తికి బిసిసిఐ అధ్యక్ష పదవి దక్కుతుందని క్రికెట్ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించిన మిథున్ మాన్హాస్.. బిసిసిఐ అధ్యక్ష రేసులు నిలిచినట్లు సమాచారం. 45 ఏళ్ల మిథున్ 157 ఫస్ట్‌క్లాస్ మ్యాచులు ఆడి 9,714 పరుగులు చేశాడు. ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. మరి మిథున్‌కి బిసిసిఐ అధ్యక్షుడిగా ఎంపిక అవుతాడో? లేదా? చూడాలి.
Also Read : తొలి భారత మహిళా క్రికెటర్ గా రికార్డు