Monday, July 15, 2024

ఓటమి పాలైతామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అడ్డగోలు విమర్శలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో రాహుల్‌గాంధీ షోలు అట్టర్ ప్లాప్: మంత్రి సత్యవతి రాథోడ్

మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలో జరిగే ఎన్నికల్లో ఓటమి పాలైనతాని తెలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. బతుకమ్మ పండగను అవమాన పరిచేవిధంగా జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకొని ఎమ్మెల్సీ కవితకు, మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ షోలు ప్లాప్ షో లుగా మారాయని కాంగ్రెస్‌కు అధికారం రావడం కల అని తెలిసిన ఆ పార్టీ నేతలు అసహనంతో మతిలేని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ కవితను అవమానించినట్టు కాదని మొత్తం తెలంగాణ మహిళలనే అవమానించారని మండిపడ్డారు. బతుకమ్మ పండగకు అసలైన వైభవం తెచ్చింది ఎమ్మెల్సీ కవిత అని బతుకమ్మను మందు బాటిళ్లు పెట్టి ఆడాలనే వ్యాఖ్యలు అభ్యంతరకరం అని, ప్రియాంకకు మందు బాటిళ్లు పెట్టే బతుకమ్మను ఇచ్చారా అని ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దల దగ్గర కాంగ్రెస్ నేతలు తెలంగాణ అస్థిత్వాన్ని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా నోరు అదుపులో పెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 6 ఏళ్లకు ఒక ముఖ్యమంత్రిని మార్చిన చరిత్ర కాంగ్రెస్‌కి ఉందని దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌కు 2018 లో వచ్చిన సీట్లు ఇప్పుడు జరిగే ఎన్నికల్లో రావన్నారు. రాహుల్ గాంధీ పరిపక్వత లేని మాటలు మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఏ తప్పు చేశారని కేసులు పెడతారని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్ పత్రికలో పెట్టుబడుల కుంభ కోణంలో రాహుల్ బెయిల్‌పై ఉన్నారని, ఆయన నీతులు చెబుతారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ అనితానాయక్, కార్పొరేటర్ దేదీప్య తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News