Wednesday, August 6, 2025

గంభీర్ తీసుకున్న ఆ నిర్ణయం సరైనదే: మహ్మద్ కైఫ్

- Advertisement -
- Advertisement -

టెండూల్కర్-ఆండర్సన్ టెస్ట్ సిరీస్‌ని టీం ఇండియా డ్రా చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి టెస్ట్‌లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 6 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. అయితే ఈ టెస్ట్ విజయం తర్వాత అభిమానులు, మాజీలు సిరాజ్‌ని పొగడ్తలతో ముంచెత్తారు. ఆ తర్వాత తొలిసారి టెస్ట్‌ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన శుభ్‌మాన్ గిల్‌ని మెచ్చుకున్నారు. చాలా తక్కువ మంది భారత విజయం వెనుక ఉన్న కోచ్ గౌతమ్ గంభీర్ శ్రమను గుర్తించారు. ఈ సిరీస్‌కి ముందు భారత్ ఆడిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లలో పేలవ ప్రదర్శనే చేసింది. స్వదేశంలో కివీస్‌తో చిత్తుగా ఓడిన టీం ఇండియా.. ఆ తర్వాత బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో కూడా ఓడిపోయింది. దీంతో గంభీర్ కోచ్ పదవి పోయినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ, టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో సిరీస్‌ని చేజార్చుకోలేదు. దీంతో గంభీర్ కోచింగ్‌పై ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) గంభీర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కోచ్‌గా ఈ సిరీస్‌లో గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని కైఫ్ అన్నారు. ‘‘బుమ్రా ఆడిన పక్షంలో కుల్దీప్‌ని జట్టులోకి తీసుకోవాలని మనం అంతా అనుకున్నాం. కానీ, గౌతమ్ గంభీర్ దృష్టంతా బ్యాటింగ్ డెప్త్‌పై పెట్టాడు. 8వ స్థానం వరకూ బ్యాటింగ్ చేసే సత్తా ఉండే వాళ్లు ఉండాలని అతను జట్టును సిద్ధం చేశాడు. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు ఎలా ఆడారో మనమంతా చూశాము. బ్యాటింగ్‌లో డెప్త్ ఉండటం వల్లే అది సాధ్యమైంది. దీని కారణంగానే మనం సిరీస్‌ని డ్రా చేసుకోగలిగాం. ఆ విషయంలో గంభీర్ తీసుకున్న నిర్ణయం సరైనదే. ప్రస్తుతం టీం ఇండియా అంతగా అనుభవం లేని ఆటగాళ్లతో నిండి ఉంది. ఇలాంటి సమయంలో కోచ్‌గా గంభీర్‌పై ఎంత ఒత్తిడి ఉంటుందో అర్థం చేసుకోగలను’’ అని కైఫ్ (Mohammad Kaif) తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News