Friday, September 13, 2024

ఆసీస్ సిరీస్‌కు షమీ

- Advertisement -
- Advertisement -

రానున్న ఆస్ట్రేలియా సిరీస్‌లో టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ జట్టులోకి వస్తాడని భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జైషా జోస్యం చెప్పారు. షమీ ఈ సిరీస్‌లో ఆడతాడనే నమ్మకం తనకుందన్నారు. గాయాలతో సతమతమై కొంతకాలంగా టీమిండియాకు దూరం గా ఉన్న షమీ ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడన్నారు. ఆస్ట్రేలియా సిరీస్‌లో షమీదే కీలక పాత్రగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

భారత ప్రధాన అస్త్రాల్లో షమీ ఒకడని, అతని అవసరం జట్టుకు ఎంతో ఉందన్నారు. ఇక త్వరలో ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ ద్వారా ఆటగాళ్ల ఫామ్‌ను పరిశీలిస్తామన్నారు. ఇందులో రాణించిన ఆటగాళ్లను బంగ్లా సిరీస్‌కు ఎంపిక చేస్తామన్నారు. ఇక భారత్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదని, ఒకే సమయంలో రెండు బలమైన జట్లను ఎంపిక చేసే సత్తా తమకుందని జైషా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News