Saturday, September 20, 2025

మోహన్ లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

- Advertisement -
- Advertisement -

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌ను భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. సినీ రంగానికి చేసిన సేవలను గుర్తించి మోహన్ లాల్‌ను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. శనివారం కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. 2023 సంవత్సరానికి గానూ మోహన్‌లాల్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. సెప్టెంబర్ 23న 71వ జాతీయ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవంలో మోహన్ లాల్‌ను సైతం భారత ప్రభుత్వం దాదాసాహెబ్ పురస్కారంతో సత్కరించబోతోంది. ఇక నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా మలయాళ చిత్రసీమలో తనదైన ముద్ర వేశారు మోహన్ లాల్. ఆయన గత ఏడాది ’బారోజ్’ మూవీతో దర్శకుడిగా మారారు. దీనిని త్రీడీలో ఆయన తెరకెక్కించారు.

‘ఎంపురాన్’ లాంటి భారీ యాక్షన్ సినిమాలనే కాకుండా… ’తుడరుమ్’ లాంటి మీడియం బడ్జెట్ చిత్రంలోనూ ఆయన నటించారు. ఇటీవల విడుదలైన ’కన్నప్ప’లోనూ మోహన్ లాల్ అతిథి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆయన నటించిన పాన్ ఇండియా మూవీ ‘వృషభ’ దీపావళికి వివిధ భాషల్లో విడుదల కానుంది. అదేవిధంగా మోహన్‌లాల్ నటిస్తున్న పేట్రియాట్ మూవీ సెట్స్‌పై ఉండగా, ’దృశ్యం -3’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుకుంటోంది. ఇక మోహన్‌లాల్ ఇప్పటివరకు 6 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. పలుసార్లు ఫిలింఫేర్ అవార్డులు, కేరళ రాష్ట్ర అవార్డులను ఆయన దక్కించుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను మోహన్‌లాల్‌కు అందజేసింది. ఇప్పుడు అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఆయనను ఎంపికచేశారు.

Also Read: స్టార్ హీరోల రికార్డులు బద్దలు.. ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోయిన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News