Wednesday, April 30, 2025

కెసిఆర్‌ను జైలులో వేస్తామన్న రేవంత్ రెడ్డి ఎందుకు గమ్మున ఉన్నారు?

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం అవినీతిపై ఆరా తీస్తాం, కెసిఆర్‌ను జైలులో వేస్తామని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు గమ్మున ఉన్నారని బిజెపి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఫండింగ్ ఇవ్వడం లేదని, నేషనల్ ప్రాజెక్టుగా గుర్తించడం లేదని అనేక సార్లు కేటీఆర్ బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ ఆమోదం అవ్వకముందే ప్రాజెక్టు మొదలుపెట్టి, నచ్చినట్టు ప్రాజెక్టు ప్లానింగ్‌లో, నిర్మాణ ప్రదేశాలలో, ప్రణాళికలలో మార్పులు చేసి, కాళేశ్వరం ప్రాజెక్టుని ఆదరాబాదరాగా కట్టాల్సిన అవసరం ఏమోచ్చిందని ప్రశ్నించారు.

2018 ఎన్నికల కోసమని దాదాపు లక్ష కోట్లపైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, ప్రాజెక్టు వ్యయం పెంచే ప్రయత్నం చేసినట్లు ఆయన ఆరోపించారు. ఇన్ని అవకతవకలు జరిగినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారని, అధికారంలోకి రాగానే చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. కెసిఆర్‌కు ఆయన కుటుంబం నుంచి ముప్పు ఉందని అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే గత కొన్నేళ్లుగా కెసిఆర్ ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారని తెలిపారు. అందరు ఒకే దగ్గర ఉంటే తనకు అపాయం అని భావించి దూరంగా ఉంటున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News