Thursday, May 2, 2024

స్టీల్ బ్రేస్ రేడియల్ టైర్లను ప్రవేశపెట్టిన ఎంఆర్ఎఫ్

- Advertisement -
- Advertisement -

అతిపెద్ద టైర్ల తయారీదారైన ఎంఆర్ఎఫ్, అత్యధిక పనితీరు కలిగిన మోటారు సైకిల్స్ కోసం ఇటీవల కొత్త స్టీల్ బ్రేస్ రేడియల్స్ ని ప్రవేశపెట్టింది. తీవ్ర పరిస్థితుల్లో అసాధారణ పనితీరు కనబరచాల్సిన హై-ఎండ్ మోటారుసైకిల్స్ కోసం ప్రత్యేకంగా తయారైనవి. గత కొన్నేళ్ళుగా ఎంఆర్ఎఫ్ లో ఆర్ & డి బృందం, వాస్తవ ప్రపంచ రేసింగ్ పరిస్థితుల్లో విస్తృతంగా పరీక్షించడానికి ముందు సాంకేతికతని అందిపుచ్చుకుని, ఇంజనీరింగ్ ని మెరుగుపరిచి ఖచ్చితత్వం సాధించింది.

ఈ టైర్లు గతిశీలమైన స్థిరత్వాన్ని, మెరుగుపర్చిన పట్టుని, త్వరగా షాక్ అబ్సార్షన్ ని, స్విఫ్ట్ స్టీరింగ్ ప్రతిస్పందనని అందిస్తాయి. అత్యధిక వేగాలతోసారే రేసింగ్ డిమాండ్లని దృష్టిలోపెట్టుకుని, అవి వంపులు తిరిగేచోట విశాలమైన కాంటాక్ట్ ప్యాచ్ ని, తగినంతపట్టుతో ఆఫర్ చేస్తాయి. అధునాత త్రెడ్ తీరు తడి ప్రాంతాల్లో గట్టి పట్టుని, టైరు సమానంగా ఆరిగేలాగా చూస్తాయి.

ఎంఆర్ఎఫ్ లి, భారతదేశంలో అతిపెద్ద టైర్ల తయారీదారు. ప్రధానకార్యాలయం ఇండియాలోని చెన్నై వుంది. టైర్లని 90 దేశాలకి ఎగుమతి చేస్తోంది. ఈ కంపెనీ, టైర్లు, త్రెడ్స్ & ట్యూబ్లు, స్పోర్ట్స్ గుడ్స్ పెయింట్స్, బొమ్మలతో సహా రబ్బర్ ఉత్పత్తులు తయారు చేస్తోంది. ఎంఆర్ఎఫ్ లి, ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ని, మోటార్ స్పోర్ట్ లో ఎంఆర్ఎఫ్ ఛాలెంజ్ సిరీస్ ని కూడా నిర్వహిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News