భార్య శృంగారానికి ఓప్పుకోలేదని.. ఆమెకు నిప్పంటించాడో భర్త. ఈ దారుణ సంఘటన ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో జరిగింది. సెక్స్ చేయడానికి నిరాకరించడంతో భార్యతో గొడవ పడి.. తర్వాత ఆమెకు నిప్పంటించి.. హత్య చేసేందుకు ప్రయత్నించిన భర్తని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 46 ఏళ్ల దినేష్ అవ్హాద్ శుక్రవారం మధ్యాహ్నం తన భార్యతో లైంగిక సంబంధంలో పాల్గొనాలని భావించాడు. కానీ, ఆమె సెక్స్ చేయడానికి నిరాకరించడంతో ఇద్దరిమధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ క్రమంలో మహిళ కోపంతో తనపై కిరోసిన్ పోసుకుని భర్తను భయపెట్టే ప్రయత్నం చేసింది. అయితే, దినేష్.. గ్యాస్ స్టవ్ నుండి ఒక కాగితాన్ని వెలిగించి ఆమెపై విసిరి వెళ్లిపోయాడు. దీంతో ఆమెకు తీవ్ర కాలిన గాయాలు అయ్యాయి. గాయాలతో సదరు మహిళ సియోన్ ఆసుపత్రిలో చేరారు. తర్వాత మహిళ ఫిర్యాదు ఆధారంగా.. హత్యాయత్నం, ఇతర నేరాలకు భారతీయ న్యాయ సంహిత నిబంధనల కింద కేసు నమోదు చేసి అవ్హాద్‌ను అరెస్టు చేసినట్లు ఆర్‌సిఎఫ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.