Thursday, March 28, 2024

ప్రశాంతంగా భారీగా

- Advertisement -
- Advertisement -

Municipal election

 

పోటెత్తిన ఓటు

అంబరాన్ని చుంబించిన
పట్టణ బ్యాలట్ సంబరం

ఓటింగ్ నమోదు

అత్యధికంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో 93.31 శాతం
అత్యల్పంగా నిజాంపేట కార్పొరేషన్‌లో 39.65 శాతం

హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పట్టణ ఓటర్లలో చైతన్యం పెరి గి భారీగా ఓటింగ్ నమోదైంది. ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో 70.26 శాతం ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 34,95,322 ఓట్లు పోలయ్యా యి. అత్యధికంగా యాదాద్రి భువగనిరి జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలో 93.31 శాతం, అత్యల్పంగా నిజాంపేట కార్పొరేషన్‌లో 39.65 శాతం పోలింగ్ నమోదైంది. 50 మున్సిపాలిటీలలో 80 శాతం, ఆపైన ఓటింగ్ నమోదైంది. ఇక తొమ్మిది కార్పొరేషన్‌లలో అత్యధికంగా రామగుండంలో 67.66 శాతం పోలింగ్ నమోదు కాగా బోడుప్పల్‌లో 64.24 శాతం, ఫీర్జాదిగూడలో 64.31 శా తం, బడంగ్‌పేట్ 63.87 శాతం, నిజామాబాద్‌లో 61.12 శాతం, బండ్లగూడ జాగీర్‌లో 56.06 శాతం, మీర్‌పేటలో 51.78 శాతం, జవహర్‌నగర్‌లో 50.02 శాతం, నిజాంపేటలో 39.65 శాత ం నమోదైంది.

అసెంబ్లీ, పార్లమెంట్ ఓటింగ్‌కు భిన్నంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. తమ ప్రాంతాలలో మంత్రులు, ఎంఎల్‌ఎలు సైతం పోలింగ్ కేం ద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిహెఎంసి పరిధిలోని డబీర్‌పుర డివిజన్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు రిటర్నింగ్ అధికారి కె.అనిల్ కుమార్ తెలిపారు. మొత్తం 27.31 శాతం పోలింగ్ నమోదైంది. మొ త్తం 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్‌లలోని 7961 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటలలోపు క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసేందుకు అధికారులు అనుమతించగా వారంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల వాగ్వాదాలు, గోడవలు చోటుచేసుకున్నాయి.

రాజకీయ పార్టీల కార్యకర్తలు పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణకు దిగగా పోలీసులు వారిని శాంతింపజేశారు. ఒకటి, రెండు చోట్ల ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం సమయానికి పుంజుకుంది. పురపాలికల్లో 80 వార్డులు ఏకగ్రీవం కాగా, కార్పొరేషన్‌లలో 3 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. మున్సిపాలిటీలో 2,647 వార్డులకు 11,099 మంది అభ్యర్థులు, 382 డివిజన్లలో 1744 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 12,843 మంది అభ్యర్థులు తమ భవిష్యత్‌ను పరీక్షించుకున్నారు. మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఉదయం 11 గంటల వరకు 36.63 శాతం, మధ్యాహ్నాం ఒంటి గంట వరకు 55.89 శాతం, 3 గంటల వరకు 67.46 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 25న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి, వెంటనే ఫలితాలను వెల్లడించనున్నారు.

పోలింగ్ శాతం నమోదు ఇలా
ఉదయం 11 గంటలకు 36.63 శాతం
మధ్యాహ్నాం 1 గంటలకు 55.89 శాతం
మధ్యాహ్నాం 3 గంటలకు 67.46 శాతం
పూర్తి వివరాలతో మొత్తం 70.26 శాతం

Municipal election polling closed
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News