Friday, April 26, 2024

పట్టణాభిషేకం మాకే

- Advertisement -
- Advertisement -

TRS

 

100 మున్సిపాలిటీలు,
9 కార్పొరేషన్లు మా ఖాతాలోనే చేరుతాయి

ప్రతి ఓటరు నోట ఇదే మాట – టిఆర్‌ఎస్ నేతల ధీమా

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం జరిగిన పురపోరు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 90 శాతానికిపైగా వార్డు లను గెలుచుకోబోతున్నదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో బుధవారం ఉదయం 7 నుంచి సా యంత్రం 5 గంటల వరకు టిఆర్‌ఎస్ భవన్ లో పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు స మీక్షించారు. ఎన్నికల పోలింగ్ సరళిని విశ్లేషించి న అనంతరం ఎన్నికల సమన్వయ కమిటీ అ ధిష్ఠానానికి ఒక నివేదిక సమర్పించింది. ము న్సిపాలిటీల్లో 52.3 ఓట్లతో సుమారు రెండువేల వార్డుల్లో కారు విజయం సాధిస్తుందని ఆ నివేదికలో పొందుపరిచారు.

అలాగే కార్పొరేషన్లలో 49.1శాతంతో సుమారు 200లకు పైగా డివిజన్లలో విజయం సాధిస్తుందని తెలియజేశారు. కార్పొరేషన్లలో టి ఆర్‌ఎస్ 49.1 శాతం, కాంగ్రెస్ 21.శాతం, బిజె పి 23.8 శాతం, ఇతరులు 2.8 శాతం ఓట్లు సా ధించే అవకాశాలున్నాయని నాయకులు భావిస్తున్నారు. ము న్సిపాలిటీ కార్పొరేషన్లలో 180 నుంచి 205 వార్డులు, కాంగ్రెస్ 40 నుంచి 60 వా ర్డులు, బిజెపి 60 నుంచి 75 వార్డులు గెలుచుకోనుందని నేతలు అంచానా వేస్తున్నారు. అలాగే 10 కార్పొరేషన్లలో కూడా టిఆర్‌ఎస్ హవా కొనసాగుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా టిఆర్‌ఎస్ జోరు
ప్రస్తుతం జరిగిన 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో టిఆర్‌ఎస్ కారు జోరుగా పరుగులు తీయనుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమంపై అభిమానంతో మాట్లాడటం దీనికి నిదర్శనమని టిఆర్‌ఎస్ సమన్వయకమిటీ అభిప్రాయం వెల్లడించింది. ఖచ్చితంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్లపై టిఆర్‌ఎస్ జెండా ఎగురుతుందనే ధీమాను పార్టీ ముఖ్యనేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడక్కడ సుమారు రెండు నుంచి మూడు శాతం వార్డు సభ్యుల్లో స్థానికంగా బలం ఉన్న ఇతర పార్టీ అభ్యర్థులు గెలుస్తారని పార్టీ విశ్లేషించింది. పోలైన ఓట్లలో అధిక శాతం టిఆర్‌ఎస్ సాధించి చరిత్ర సృష్టించనుందనే ఆశాభావాన్ని టిఆర్‌ఎస్ నాయకత్వం స్పష్టం చేస్తోంది.

కాంగ్రెస్, బిజెపిల అసత్యప్రచారాన్ని నమ్మలేదు
అధికార టిఆర్‌ఎస్ పార్టీపై అసత్యప్రచారాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ప్రయత్నించిన బిజెపి, కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో ప్రజలు దూరంగా ఉంచారని టిఆర్‌ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని వార్డుల్లో అసహనానికి గురైన కాంగ్రెస్,బిజెపి రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినా టిఆర్‌ఎస్ క్రమశిక్షణతో ముందుకు వెళ్లిందని, విపక్షాలు రెచ్చగొట్టిన సహనంతో ప్రజాక్షేత్రంలో ప్రజలపక్షాన టిఆర్‌ఎస్ నిలిచిందని ఎన్నికల సమన్వయకమిటీ చెప్పింది. ప్రధానంగా నిజమాబాద్, ఆదిలాబాద్‌లో ఓటర్లు కొంతమేరకు మిశ్రమంగా స్పందించినా టిఆర్‌ఎస్ వైపే అత్యధిక శాతం ఓటర్లు ఉన్నట్లు పోలింగ్ సరళి స్పష్టం చేసిందని టిఆర్‌ఎస్ భావిస్తోంది.

ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రులు
నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలుగా వ్యవహరించిన మంత్రు లు తొలుత ఓటు హక్కును వినియోగించుకుని మిగతా కార్యకార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఇందులో భా గంగా మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు సూర్యాపేటలోని సిద్ధార్థ కళాశాలలోని 136వ పోలింగ్‌బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకోగా మంత్రి కొప్పుల ఈశ్వర్ గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ మంత్రి, ఎంఎల్‌సి మహేందర్ రెడ్డి వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓటు హక్కువినియోగించుకున్నారు.

వనపర్తి బాలుర జూనియర్ కళాశాలలోని 2వ పోలింగ్ కేంద్రంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిర్యాలగూడ రెడ్డి కాలనీలోని ఎస్.ఆర్.డి.జి స్కూల్లో కుటుంబ సమేతంగా శాసనమండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి, శాసనసభ్యుడు భాస్కర్ రావుతో కలసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి కార్యదర్శి పాల్‌రెడ్డి మహబూబాబాద్‌లోని 82వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే స్థానిక శాసనసభ్యులు, మంత్రులు ఓటు హక్కును వినియోగించుకుని మిగతా ఓటర్లకు ఆదర్శంగా నిలిచారు.

ఫలించిన టిఆర్‌ఎస్ వ్యూహం
విక్షాల సత్యప్రచారాన్ని తిప్పికొడుతూ అభివద్ధి లక్షం గా ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన టిఆర్‌ఎస్ ప్రజలను ఆకట్టుకోగలిగిందనే అభిప్రాయం టిఆర్‌ఎస్ నాయకుల్లో వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం నుంచి సంక్షేమపథకాల ద్వారా లబ్ది పొందిన ప్రతి ఒక్కరూ ఓటువేసేందుకు పోలింగ్‌బూత్‌ల ముందు బారులు తీరి ఉండటమే దీనికి తార్కాణమని టిఆర్‌ఎస్ నాయకులు భావిస్తున్నారు. టిఆర్‌ఎస్‌అధినేత, సిఎం కెసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిఎంట్ కెటిఆర్ చేసిన దిశానిర్దేశం మేరకు ఎన్నికల ప్రచారం ప్రజలను ఆకట్టుకుందని వారు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఖచ్చితంగా జిల్లాపరిషత్ ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయనే భావనలో టిఆర్‌ఎస్ నాయకత్వం ఉంది. అభివృద్ధిని కోరుకునే ప్రజలంతా టిఆర్‌ఎస్‌కు ఓటు వేసినట్లు సమాచారం వస్తోందని నాయకులు చెప్పారు.

తొలిసారిగా ఓటువేసిన యువత
మున్సిపాలిటీ, కార్పొరేషన్ పోలింగ్‌లో యువతరం టిఆర్‌ఎస్ పక్షాన నిలిచింది. కొత్తగా ఓటుహక్కును పొందిన యువతరం కళాశాలలకు సెలవుపెట్టి సొంత ఊర్లకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధానంగా లక్షలాధి యువతరం టిఆర్‌ఎస్ పక్షానికి బలంగా నిలిచినట్లు తెలుస్తోంది. టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ విధానాకు ఆకర్షితులైన యువతరం టిఆర్‌ఎస్‌కు ఓట్లు వేసినట్లు చెప్పారు. ముఖ్యంగా కళాశాలల విద్యార్థులు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు తమ ఓటు హక్కును అధికశాతం వినియోగించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి యువతరం టిఆర్‌ఎస్ పక్షానే నిలిచింది. అలాగే పట్టణాభివృద్ధిపై కెటిఆర్ చేసిన ప్రకటనలు యువతరాన్ని ఆలోచింపచేశాయి. నూతన మున్సిపాలిటీ చట్టం అమలుతో పట్టణాలు బాగుపడుతాయనే అభిప్రాయాన్ని యువతరం వ్యక్తం చేసింది.

ప్రతిపక్షాలకు ఆశాభంగం తప్పదు: పల్లా
మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్,బిజెపికి ఆశాభంగం తప్పదని టిఆర్‌ఎస్ మున్సిపాలిటీ,కార్పొరేషన్ల ఎన్నికల సమన్వయకమిటీ ధీమావ్యక్తం చేసింది. టిఆర్‌ఎస్ కార్యాలయం నుంచి సమన్వయకమిటీ పోలింగ్ సరళిని ఎప్పటి కప్పుడు విశ్లేషించింది. తొమ్మిది మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా చేరి బుధవారం పోలింగ్ సరళిని విశ్లేషించి అధిష్టానానికి నివేదికలు సమర్పించారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ ప్రధానకార్యదర్శి,ఎంఎల్‌సి, రైతు సమన్వయ సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భవించిన అనంతరం తొలిసారిగా జరుగుతున్న మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటర్లు టిఆర్‌ఎస్ పక్షంలో నిలిచినట్లు పోలిం గ్ సరళి స్పష్టం చేసిందని చెప్పారు.

పోలింగ్ శాతం పెరగడం, లబ్దిదారులు ఉదయం నుంచి బారులుతీరి నిలబడటం, యువతరం టిఆర్‌ఎస్ పక్షాన ఉండటం, ప్రభు త్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరడం టిఆర్‌ఎస్ విజాయానికి ప్రధాన కారణాలు అవుతున్నాయని ఆయన చెప్పారు. ఓటర్లలో ఉన్నఉత్సాహాన్ని చూస్తుంటే 100 పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు టిఆర్‌ఎస్ గెలుచుకోనుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికల్లో ఓటర్లు అప్రతిహత విజయం అందిస్తున్నారని చెప్పారు.

కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం ఎజెండాకు తోడుగా మంత్రి కెటిఆర్ పనితీరును ప్రజలు అర్థంచేసుకుని ఆశీర్వదిస్తున్నారని చెప్పా రు. ప్రతిపక్షాలు సరైన అభ్యర్థులను పోటీలో నిలపడం లో విఫలమయ్యాయని ఆయన దుయ్యబట్టారు. రేయింబవళ్లు పార్టీ విజయం కోసం శ్రమించిన టిఆర్‌ఎస్ శ్రేణులకు, ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లకు కృజ్ఞతలు తెలిపారు. జిల్లాపరిషత్ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయనే ధీమాను పల్లా వ్యక్తం చేశారు.

TRS is going to win over 90% of wards
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News