Friday, May 3, 2024

కమిషన్ ఇవ్వలేదని కత్తితో పొడిచారు….

- Advertisement -
- Advertisement -

Murder attempt in Hyderabad

హైదరాబాద్: సెకండ్ హ్యాండ్ కారు అమ్మినప్పుడు కమిషన్ ఇవ్వలేదని ఓ యువకుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నయిమ్ (25) అనే యువకుడు సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఖయ్యుమ్ అనే యువకుడు ఒక కారును నయిమ్‌కి విక్రయించమని చెప్పాడు. మధ్యవర్తిగా ఉండడంతో కమిషన్ డబ్బులు ఇవ్వాలని కోరాడు. నయిమ్ కారును విక్రయించాడు కానీ ఖయ్యుమ్‌కు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. కమిషన్ ఇవ్వాలని నయిమ్‌ను ఖయ్యుమ్ అడిగిన కూడా స్పందించలేదు. బుధవారం రాత్రి నయిమ్ ఇంటికి వచ్చిన ఖయ్యుమ్ బయటకు రావాల్సిందిగా కోరాడు. నయిమ్ బయటకు రాగానే కత్తితో పొడిచి ఖయ్యుమ్ పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News