Wednesday, August 6, 2025

నిర్మల్ లో అత్యాచారం… అల్లుడిని చంపిన అత్త

- Advertisement -
- Advertisement -

నిర్మల్: మద్యం మత్తులో అత్తపై అత్యాచారం చేయడంతో అల్లుడిని వృద్ధురాలు హత్య చేసింది. ఈ సంఘటన నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలో ఓ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహారాష్ట్రకు చెందిన షేక్ నజీం(45) తన భార్య, కుమారుడు, అత్తమ్మతో కలిసి ముథోల్ మండలంలో ఓ గ్రామంలో నివాసం ఉంటున్నారు. నజీం మద్యానికి బానిసగా మారి తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. నజీం భార్యకు పది రోజుల క్రితం మహారాష్ట్రలో కూలీ పనులు దొరకడంతో తన కుమారుడితో కలిసి ఆమె అక్కడికి వెళ్లింది. ఇంట్లో అత్త, అల్లుడు మాత్రమే ఉంటున్నారు. రెండో రోజుల క్రితం మద్యం తాగి అత్తపై అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో ఆమె గాయపడడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి వచ్చింది. సోమవారం అర్థరాత్రి ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. కర్రతో అతడి తలపై అత్త బాది అనంతరం గొంతు నులిమి హత్య చేసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసి అత్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News