Tuesday, September 10, 2024

ఘనంగా నాగచైతన్య నిశ్చితార్థం

- Advertisement -
- Advertisement -

హీరో నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం ఉదయం 9.42 గంటలకు ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా నాగార్జున తెలియజేశారు. “నూతన జంట జీవితం… ఆనందం, ప్రేమతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది” అని నాగార్జున తన పోస్ట్‌లో తెలిపారు. ఇక తన మాజీ భార్య సమంతతో విడాకుల తరువాత చైతూ… శోభితా ధూళిపాలతో ప్రేమలో పడ్డారు. చివరికి ఇరు కుటుంబాల సమ్మతితో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఇక నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ చిత్రం చేస్తున్నారు. 2016లో సినీ రంగంలోకి వచ్చిన శోభితా ధూళిపాళ్ల… గూఢాచారి, మేజర్ సినిమాలతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె టాలీవుడ్, బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News