Thursday, October 10, 2024

దేవర రిలీజ్.. అభిమానులకు నాగవంశీ రిక్వెస్ట్‌

- Advertisement -
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం దేవర. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి పార్ట్ సెప్టెంబర్ 27 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటికే సెలబ్రేషన్స్ షురూ చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రముఖ నిర్మాత నాగవంశీ అభిమానులను రిక్వెస్ట్  చేస్తూ పెస్ట్ పెట్టారు.

“తారక్‌ అన్న చాలా గ్యాప్‌ తర్వాత మంచి ఎమోషనల్‌ మాస్ కంటెంట్‌తో వస్తున్నారు. ప్రేక్షకులకు మంచి కంటెంట్‌ని అందించడంలో ఆయన తనవంతు బాధ్యత నిర్వర్తించారు. ప్రభుత్వ సాయంతో చాలా రోజుల తరువాత ఏపీలో బెనిఫిట్‌ షోలు, ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో దీనిని విడుదల చేసేలా మేము మా బాధ్యత పూర్తి చేశాం. మా నుంచి ఒక చిన్న విజ్ఞప్తి. మీరు కూడా బాధ్యతతో.. ప్రశాంతంగా ఉండండి. అనవసరమైన ఫ్యాన్‌ వార్స్‌ క్రియేట్‌ చేయొద్దు. ఇలాంటి ఫ్యాన్‌ వార్స్ వల్ల మన సినిమాపై మనమే నెగటివిటీ ఆహ్వానిస్తున్నట్లు. దీనివల్ల తాత్కాలిక ఆనందం పొందవచ్చు. కానీ, మన హీరోల చిత్రాలపై ఇది ఎంతో ప్రభావం చూపిస్తుంది. దయచేసి అభిమానులంతా ఫ్యాన్‌ వార్స్‌కు స్వస్తి పలికి సినిమాని ఎంజాయ్‌ చేయాలని కోరుతున్నా. ఈ సినిమా నుంచి అయినా సోషల్‌ మీడియా వేదికగా జరిగే ఫ్యాన్‌ వార్స్‌కు ముగింపు పలికేలా ప్రతిన పూనండి. అదేవిధంగా ఫస్ట్‌ స్క్రీనింగ్‌లో సినిమా చూసే అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు షేర్‌ చేయొద్దు. పక్కవారు వీడియోలు తీయకుండా చూడండి. మీ తర్వాత చూసే అభిమానులూ సినిమాని ఎంజాయ్‌ చేయనివ్వండి. తారక్‌ అన్నకు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్‌ అందిద్దాం. దేవర సెప్పిండు అంటే సేసినట్టే’’ అని ఎక్స్ లో నాగవంశీ రాసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News