చెన్నై: అప్పుల బాధ భరించలేక ముగ్గురు కూతుళ్లను నరికి చంపి అనంతరం తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం నామక్కల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాసిపురం గ్రామంలో గోవింద రాజు -భారతి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఒక బాలుడు అనేశ్వరణ్, ముగ్గురు కూతుళ్లు ప్రణతీత(10), రితిక శ్రీ(9), దేవి శ్రీ(6)లు ఉన్నారు. అతడు 14 లక్షల రూపాయలు అప్పులు చేశాడు. అప్పులు తీర్చడానికి ఉపాధి నిమిత్తం కేరళకు వెళ్లాడు. ప్రతి నెల ఇఎంఐలు రూ.48000 కట్టలేక ఇబ్బందుల్లో ఉన్నాడు. పీకల్లోతు అప్పుల్లో కూరకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక చావే శరణ్యమని అనుకున్నాడు. వెంటనే ముగ్గురు కూతుళ్లను దారుణంగా నరికి చంపి అనంతరం తండ్రి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ముగ్గురు కూతుళ్లను నరికి చంపి… తండ్రి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -