Sunday, April 28, 2024

యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉంది..

- Advertisement -
- Advertisement -

రియాద్: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ యుద్ధ పరిస్థితులపై ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇరాన్, సౌదీ మధ్య కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న శత్రుత్వానికి ముగింపు పలికేలా ఇటీవల ఈ రెండు దేశాలు చారిత్రక ఒప్పందం చేసుకున్న తర్వాత వీరిద్దరూ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పాలస్తీనాలో యుద్ధ నేరాలకు ముగింపు పలకాల్సిన అవసరంపై రైసీ,

సల్మాన్ చర్చించినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ యుద్ధాన్ని నిలిపివేసేందుకు సౌదీ రాజ్యం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అన్ని అంతర్జాతీయ, ప్రాంతీయ భాగస్వాములతో చర్చలు జరుపుతోంది. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక ప్రజల ప్రాణాలు పోవడాన్ని సౌదీ ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది. పాలస్తీనా ప్రజలకు చట్టబద్ధమైన హక్కులను పునరుద్ధరించడం, ఆ ప్రాంతంలో శాంతి స్థాపన చర్యలకు సౌదీ మద్దతిస్తుంది అని యువరాజు ఇరాన్ అధినేతకు హామీ ఇచ్చినట్లు సౌదీ అధికారిక మీడియా ప్రకటించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News