Thursday, May 2, 2024

కాంగ్రెస్‌లేని ప్రతిపక్షాల ఐక్యకూటమి సాధ్యం కాదు: నవాబ్‌మాలిక్

- Advertisement -
- Advertisement -

నాగపూర్: కాంగ్రెస్‌తోపాటు యుపిఎలోలేని పార్టీలతో కలిపి ప్రతిపక్షాల ఐక్య కూటమిని ఏర్పాటు చేయాలని ఎన్‌సిపి ముఖ్య అధికారప్రతినిధి, మహారాష్ట్రమంత్రి నవాబ్‌మాలిక్ అన్నారు. కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్ష కూటమి అనేది ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తమ పార్టీ అధినేత శరద్‌పవార్ తేల్చి చెప్పారని మాలిక్ గుర్తు చేశారు. అయితే, యుపిఎయేతర ప్రతిపక్షాలకు 150మంది లోక్‌సభ సభ్యుల బలమున్నదని మాలిక్ తెలిపారు. ప్రతిపక్షాలను ఐక్యం చేయాల్సిన అవసరమున్నదని, అందుకు కృషి చేయడానికి పవార్ సిద్ధంగా ఉన్నారని మాలిక్ తెలిపారు. బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమికి నేతృత్వం వహించేది ఎవరన్న ప్రశ్నకు జవాబిస్తూ సమిష్టి నాయకత్వమని పవార్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని మాలిక్ గుర్తు చేశారు. ఇటీవల పవార్‌తో భేటీ అనంతరం బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇంకెక్కడి యుపిఎ అంటూ పరోక్షంగా కాంగ్రెస్‌ను, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పట్ల ఎన్‌సిపి వైఖరి, మమత ఆలోచనా విధానానికి భిన్నమని అర్థమవుతోంది.

Need to Unite Opposition include Congress: Nawab Malik

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News